Site icon vidhaatha

Gaddar Award: గద్దర్ అవార్డు నమూనా ఇదే..!?

Gaddar Award: : తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఇప్పటికే 2014 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించి గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం అవార్డు నమునాను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే తాజాగా గద్దర్ అవార్డు నమునాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల స్థూపాన్ని తలపించేలా ఉన్న గద్దర్ అవార్డు నమునా ఫోటోలో అడుగు భాగం గద్దెపై ఫిల్మ్ రీల్ బాక్స్, దానిపై భాగంలో ఎత్తిన చేతిలో డప్పు..బ్యాక్ గ్రౌండ్ లో సినిమా రీల్ కనిపిస్తుంది.

ప్రజాగాయకుడు గద్దర్ ఆటపాటను..విప్లవ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ నమూనా ఉందని భావిస్తున్నారు. తెలుగు సినిమాలకు పంపిణీ చేసే నంది అవార్డులు నిలిచిపోయిన 14ఏళ్లకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు రూపంలో తిరిగి పంపిణీ చేయబోతున్నారు. ఈ నెల 14న ఐటెక్స్ వేడుకగా అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు.

Exit mobile version