Site icon vidhaatha

Viral Video | జింక‌పై చిరుత దాడి.. వేటాడడం అంటే ఇదేనేమో..

విధాత‌: వేటాడంలో ముందుండే జంతువుల్లో చిరుత ఒక‌టి. దానికి క‌నిపించిన ప్ర‌తి జంతువును వేటాడి చంపేస్తుంది. వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే ఉండదు. అయితే ఈ చిరుత చాలా తెలివిగా జింక‌పై దాడి చేసింది.

రోడ్డు పొడవునా ఉన్న ఇసుక‌ను, ఓ చెట్టును అడ్డుగా చేసుకుని జింక‌పై రెప్ప‌పాటులో దాడి చేసి, బ‌లి తీసుకుంది చిరుత‌. ఐఎఫ్ఎస్ అధికారి ర‌మేశ్ పాండే త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఓ అడ‌విలో ఉన్న చెట్టుకు స‌మీపంలో ఓ జింక మేత మేస్తూ ఉంది. దానికి కొంచెం దూరంలోనే రోడ్డు కూడా ఉంది. అయితే చిరుత కంట జింక ప‌డింది. ఇక ఎలాగైనా జింక‌ను వేటడాల‌నుకున్న చిరుత‌.. త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించింది.

రోడ్డు పొడ‌వునా ఉన్న ఇసుక‌ను అడ్డు చేసుకుని, జింక‌కు ఎలాంటి అనుమానం రాకుండా చెట్టు వెనుకాల‌కు చేరింది. మెల్ల‌గా ఒక్కో అడుగు వేస్తూ.. క్ష‌ణాల్లోనే జింక‌పై దాడి చేసింది చిరుత‌. అయితే చిరుత నుంచి జింక త‌ప్పించుకునేందుకు ప‌రుగు పెట్టింది. కానీ చిరుత వేటాడి చంపేసింది.

Exit mobile version