Site icon vidhaatha

Tomato | టామోటాలతో తులాభారం

Tomato

విధాత: టామోటాలకు భారీగా ధరలు పెరిగిపోయిన నేపధ్యంలో టామోటాలకు సంబంధించి ప్రతిదీ జనంలో ఆసక్తి రేపుతుంది. తన కూమార్తె భవిష్యత్ కోసం ఓ వ్యక్తి టమోటాలతో వేసిన తులాభారం అందరికి ఆకర్షించింది. ఏపీలోని అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో జగ్గ అప్పారావు తన కుమార్తె భవిష్యత్ కోసం 51కేజీల టామోటాలతో తులాభారం నిర్వహించారు.

అనంతరం బెల్లం, పంఛధారాలతో కూడా తులాభారం వేశారు. టామోటాల తులాభారాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు వింతగా, ఆసక్తిగా తిలకించి టామోటాలకు ఎంత వైభోగమొచ్చిందంటు చర్చించుకోవడం కనిపించింది. అసలే అధిక ధరల నేపధ్యంలో తులాభారం వేసిన టామోటాలను వృధా చేయకుండా ఆలయ నిత్యాన్నదానంలో వినియోగించేందుకు ఆలయ అధికారులు నిర్ణయంచారు.

Exit mobile version