నడి రోడ్డును దర్జాగా దాటుతున్న పెద్ద పులులు

విధాత‌: పెద్ద పులులు అంటేనే భ‌యంతో వ‌ణికిపోతాం. మ‌రి వాటిని ప్ర‌త్య‌క్షంగా చూస్తే శ‌రీర‌మంతా చెమ‌ట‌లు ప‌డుతోంది. అలాంటిది ఓ రెండు పెద్ద పులులు రోడ్డు దాటుతుండ‌గా.. అట‌వీ శాఖ అధికారులు వాహ‌నాల‌న్నీంటిని రెండు వైపులా ఆపేశారు. పెద్ద పులి రోడ్డు దాట‌గా, దాని పిల్ల కూడా వెనుకాలె ప‌రుగెత్తింది. పెద్ద పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాల‌ను ఓ వాహ‌న‌దారుడు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైరల్ చేశారు. పులులు వాహ‌నదారుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ప్ర‌తి రోజు […]

  • Publish Date - January 7, 2023 / 06:00 AM IST

విధాత‌: పెద్ద పులులు అంటేనే భ‌యంతో వ‌ణికిపోతాం. మ‌రి వాటిని ప్ర‌త్య‌క్షంగా చూస్తే శ‌రీర‌మంతా చెమ‌ట‌లు ప‌డుతోంది. అలాంటిది ఓ రెండు పెద్ద పులులు రోడ్డు దాటుతుండ‌గా.. అట‌వీ శాఖ అధికారులు వాహ‌నాల‌న్నీంటిని రెండు వైపులా ఆపేశారు.

పెద్ద పులి రోడ్డు దాట‌గా, దాని పిల్ల కూడా వెనుకాలె ప‌రుగెత్తింది. పెద్ద పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాల‌ను ఓ వాహ‌న‌దారుడు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైరల్ చేశారు. పులులు వాహ‌నదారుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు.

ప్ర‌తి రోజు త‌డోబా పార్కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న రోడ్ల‌పై పులుల‌తో పాటు ఇత‌ర వన్య‌ప్రాణులు రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతూ ఉన్నాయి. పులుల‌, వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు ఎన్జీటీ ఉత్త‌ర్వుల‌ను ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.