Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (సోమవారం, ఫిబ్రవరి 24)న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
దూర ప్రయాణాలు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ కార్యక్రమాలు అనుకూలం. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ ఆరోగ్యం. అధిక ఖర్చులు. ధైరసాహసాలతో ముందుకు వెళ్తారు. విదేశీ యత్నాలు. వ్యాపార వ్యవహారాలు అనుకూలం.
వృషభం
వృత్తిపరమైన వృద్ధి. అనుకోని ఆందోళనలు చికాకులు. ఆకస్మిక ధననష్టం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. వారం చివరిలో ఆశించిన ఫలితాలు. స్వల్ప అనారోగ్య సమస్యలు. వృధా ప్రయాణాలు. స్థానచలన సూచనలు. స్త్రీల సహకారంతో ఆశించిన విజయాలు. సన్నిహితులతో విరోధం వచ్చే అవకాశం. దేవాలయాల సందర్శణ.
మిథునం
రావలసిన ధనం అందుతుంది. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య బాధలు అధికం. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అకారణంగా కలహాలు. అనవసర భయాలు. ఆశా జనకంగా వృత్తి పర విషయాలు. ఆర్థిక విషయాలు అనుకూలం. ఖర్చులు అధికం. ముఖ్యమైన పనులు వాయిదా.
కర్కాటకం
ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కుటుంబ విషయాల్లో మార్పులు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. లాభదాయకంగా వృత్తి సంబంధించిన విషయాలు. ఆకస్మిక కలహాలు. ధన నష్టాలు. రుణ ప్రయత్నాలు అధికం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. అనుకూలంగా న్యాయ సంబంధమైన విషయాలు. మానసిక ఆందోళన అధికం.
సింహం
ఇష్టమైన వ్యక్తులు, సంతాన వృద్ధి కొరకు అధిక ఖర్చులు. అనుకున్నది జరుగదు. స్వల్పంగా అనారోగ్య సమస్యలు. మనసు చంచలం. అనుకూలంగా వృత్తి పరమైన విషయాలు. పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యం. ఖర్చులు అధికం. వ్యాపారాలు విస్తరించే ఆలోచన. మిత్రుల నుంచి బహుమానాలు.
కన్య
వృత్తి, ఉద్యోగ రంగాల్లో వృద్ధి. ఆత్మీయులను కలవడంలో విఫలం. స్త్రీల వళ్ల ధన లాభం. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం. ఉన్నత విద్య, దూర ప్రయాణాల విషయాల్లో పెద్దల సహకారం. అనవసర వ్యయ ప్రయాసలు. తీవ్ర మానసిక ఆందోళన. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం. వృథా ప్రయాణాలు ఎక్కువ. అప్పులు తీర్చుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తుల
సామర్థ్యానికి తగిన గుర్తింపు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు. స్త్రీలతో విభేదాలు. అన్నింటా విజయం. బంధు, మిత్రులు కలుస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో వారికి అభివృద్ధి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం.
వృశ్చికం
సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరం. బంధు, మిత్రులతో వైరం, శతృబాధలు ఉండే అవకాశం. చేయని తప్పులకి ఘర్షణ. ఆలస్యంగా రుణ ప్రయత్నాలు. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. మిత్రలు, ఫ్యామిలీతో కలిసి విందుల్లో పాల్గొంటారు. గృహ వాతావరణంలో అనిశ్చితి.
ధనుస్సు
ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అధికం. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక నిర్ణయాలు. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులు. ముఖ్యమైన కార్యాలు పూర్తి. సులభంగా శుభకార్య ప్రయత్నాలు. అప్పుల విషయంలో రుణదాతల ఒత్తిడి అధికం.
మకరం
నూతనకార్యాలు ఆలస్యంగా ఆరంభం. అనారోగ్య సమస్యలు. ఒక విషయం వళ్ల తీవ్ర మనస్తాపం. అనవసర భయాందోళనలు. స్థిరాస్తులు, కొనుగోలులో మోసపోకుండా జాగ్రత్త వహించాలి. సంతానం, విద్యకు సంబంధించిన విషయాలతో ప్రశాంత తగ్గుతుంది. అనవసర మాటల వల్ల అపార్ధాలు ఏర్పడే అవకాశం.
కుంభం
నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. అనవసర వివాదాలకు, అపార్థాలకు దూరంగా ఉండాలి. మనోల్లాసం పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు. ముఖ్యమైన విషయాలు, ప్రభుత్వ సంబంధిత పనులు, రుణాలు, ఇతర ఆర్థిక అంశాల ఆలస్యంతో చికాకు.
మీనం
బద్దకం తగ్గించుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణాలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ సమస్యలు పోతాయి. శత్రుబాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం. వృత్తి సంబంధిత విషయాల్లో అనుకూలత. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.