Site icon vidhaatha

Hyderabad | దిగొస్తున్న ట‌మాటా ధ‌ర‌లు.. రైతు బ‌జార్లో కిలో రూ. 63..!

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలో ట‌మాటా ధ‌ర‌లు దిగొస్తున్నాయి. వారం రోజుల క్రితం వ‌ర‌కు కిలో ట‌మాటా ధ‌ర రూ. 200 ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కిలో ట‌మాటా ధ‌ర రూ. 100 ప‌లుకుతోంది. అయితే హైద‌రాబాద్‌కు ట‌మాటా రాక పెరుగుతోంది. దీంతో రైతు బ‌జార్ల‌లో వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ కిలో మొద‌టి ర‌కం ట‌మాటా రూ. 63గా నిర్ధారించారు. కానీ రైతుబ‌జార్ల‌లోని శాశ్వ‌త దుకాణాదారులు మాత్రం కిలో రూ. 100కు త‌గ్గ‌కుండా అమ్ముతున్నార‌ని కొనుగోలుదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్టేట్ అధికారికి ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని మండిప‌డుతున్నారు.

న‌గ‌రానికి 10 రోజుల కింద‌ట కేవ‌లం 850 క్వింటాళ్ల ట‌మాటా వ‌స్తే.. సోమ‌వారం 2,450 క్వింటాళ్లు హోల్ సేల్ మార్కెట్‌కు వ‌చ్చింది. అనంత‌పురం, చిత్తూరు, క‌ర్ణాట‌క నుంచి న‌గ‌రానికి ట‌మాటా దిగుమతి అవుతోంది. దీనికి తోడు రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల‌, న‌వాబ్‌పేట‌, మెద‌క్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు ట‌మాటా ఎక్కువ మొత్తంలో రావ‌డ‌మే ధ‌ర త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు కిలో రూ. 50 లోపు ఉండొచ్చ‌ని వ్య‌వ‌సాయ మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version