Tomato
- టమాట వాడకాన్ని బంద్ చేసిన ప్రముఖ బార్లు, రెస్టారెంట్లు
విధాత: వర్షాకాలం మన కాళ్ల ముందుకు వచ్చింది. కానీ వర్షాలు మాత్రం శూన్యం. వర్షాలు సరైన సమయానికి రాకపోవడంతో వాటి ప్రభావం వ్యవసాయంపైన , మార్కట్ పైన పడుతున్నది. కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మామూలు వాళ్లు కూరగాయలు కొనలేని పరిస్థితి వస్తున్నది. టమాటా రేట్లు వింటేనే మూర్చలు వచ్చినంత పని అవుతున్నది.
మామూలు ప్రజలకే కాదు పెద్ద, పెద్ద పెట్టుబడులు కలిగి ఉవున్న కార్పోరేట్ కంపెనీలకు కూడా పెరిగిన టమాటా రేట్లతో భయం పుట్టుక వస్తున్నది. దానితో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు వంటి వ్యాపార రంగము లోని కార్పోరేట్ కంపెనీలు టమాటా వాడకాన్ని బంద్ పెట్టుకుంటున్నాయి.
ఇప్పుడిప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం రెస్టారెంట్ల రంగంలోని దిగ్గజ విదేశీ కంపెనీ.. మెక్డోనాల్డ్ తమ బార్ లు, రెస్టారెంట్లలో టమాటా వాడకాన్ని ఆపి వేసుకున్నాయి. టొమాటో ధరల పెరుగుదల కారణంగా అర కొర టమాటాలతో రుచిని సాధించ లేమని తమ బర్గర్, రాపర్స్, ఫిజ్జాలలో టమాటాలు ఉపయోగించడాన్ని ఆపు చేశాయి.
మెక్‌డొనాల్డ్స్ తన కొన్ని ఉత్తర, తూర్పు భారతీయ హోటల్లలో టమాటా ఉపయోగించడం ఆపివేసింది. కూరగాయల హోల్‌సేల్ ధరలు ఒక నెలలో 288% పెరిగాయి. కొన్ని ప్రాంతాలలో టమాటా కిలోకు 260 రూపాయల వరకు పెరిగాయి. రెస్టారెంట్ లు, బారులు చెయిన్ హోటల్లలో పెరుగుతున్న టమాటా ధరలతో ప్రభావితమవుతున్నాయి.
తమ వ్యాపారంలో నష్టాలను చూడవలసి వస్తున్నదని అంటున్నాయి. అయితే హోటల్లకు సంబంధించిన ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్ వాళ్లు తెలిపిన లెక్కల ప్రకారం టమాటా ధరలు పెరగడం వలన పూరీల వాడకం డబల్ అయ్యింది. మా లభాల శాతం అలాగే కొనసాగుతున్నదని అన్నాయి.