Site icon vidhaatha

మహాత్మా ఫూలే ఆశయాలను సాధించడమే లక్ష్యం

విధాత, వరంగల్ ప్రతినిధి: నిమ్న వర్గాల ప్రజలను కులదోపిడి నుంచి విముక్తి చేయడానికి, రైతు కూలీల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను సాధించడమే లక్ష్యమని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు. ఇదే మనం ఆయనకి ఇచ్చే నివాళులని అన్నారు. మహాత్మ జ్యోతి భా పూలే జయంతి సందర్బంగా టి పి టి ఎఫ్ అధ్వర్యంలో గురువారం ములుగురోడ్ జంక్షన్ లో జ్యోతి భా పూలే విగ్రహానికి జిల్లా నాయకులతోకలిసి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భోగేశ్వర్ మాట్లాడుతూ పూలే తను స్థాపించిన. “సత్యశోదక్ సమాజ్” సంస్థద్వార శూద్రులు,అతి శూద్రులు మహిళలు తమ హక్కులు నిల బెట్టు కోగలరని గుర్తించి వారిలో విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరిచి విద్యా వ్యాప్తి కోసం కృషి చేశాడన్నారు. సాంఘిక సమానత్వాన్ని పెంపోందిచడానికి, దళితులను వెనుకబడిన కులాలను, ఇతరకులాలను ఏకం చేయడానికి కృషి చేశారన్నారు. కులపరంగా, మతపరంగా సమాజంలో పేరుకపోయిన దురాచారాలను, సాంప్రదాయలను, మత కట్టుబాట్లను తొలగించడానికి పనిచేశారన్నారు.

సత్యాన్వేషణ చేయడానికి సత్య శోదక్ సంస్థ ద్వారా అనేక మార్పులు తీసుకవచ్చారని అన్నారు. పూలే కలలుగన్న సమాజాన్ని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం ముందుకు సాగడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమములో వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు జి. వెంకటేశ్వర్లు, పూజారి మనోజ్ కుమార్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సత్యనారాయణ పూర్వ ప్రదాన కార్యదర్శి బీమళ్ళ సారయ్య, రాధాకృష్ణలు పాల్గొన్నారు.

Exit mobile version