Site icon vidhaatha

Hyderabad | హైద‌రాబాద్‌లో బోనాల పండుగ‌.. ఆది, సోమ‌వారాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Hyderabad |

ఆషాఢ బోనాల పండుగ‌కు హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా ముస్తాబైంది. న‌గ‌ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆల‌యాల‌ను విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. అమ్మ‌వారి పాట‌ల‌తో న‌గ‌ర వీధుల‌న్నీ మార్మోగిపోతున్నాయి.

బోనాల వేడుక‌ల నేప‌థ్యంలో పాత‌బ‌స్తీ, అంబ‌ర్‌పేట‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ మేర‌కు న‌గ‌ర ట్రాఫిక్ అద‌న‌పు సీపీ సుధీర్ బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆది, సోమ‌వారాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు.

పాత‌బ‌స్తీలోని చార్మినార్, ఫ‌ల‌క్‌నూమా, న‌యాపూల్ వైపు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ మార్గాల్లో వ‌చ్చే బ‌స్సుల‌ను, ఇత‌ర వాహ‌నాల‌ను ఓల్డ్ సీబీఎస్, అఫ్జ‌ల్‌గంజ్‌, దారుల్‌షాఫ ఎక్స్ రోడ్, ఇంజిన్ బౌలి వ‌ర‌కే అనుమ‌తిస్తారు. దీంతో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఈ ఆంక్ష‌లు ఆదివారం ఉద‌యం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

అంబ‌ర్‌పేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమల్లో ఉండ‌నున్నాయి. ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను ఉప్పల్‌ చౌరస్తా, హబ్సిగూడ, తార్నక, అడిక్‌మెట్‌, విద్యానగర్‌, ఫీవర్‌ హాస్పిటల్‌, కాచిగూడ, చాదర్‌ఘాట్‌ వైపు మళ్లిస్తారు.

కోఠి నుంచి వెళ్లే వాహనాలను కాచిగూడ, ఫీవర్‌ హాస్పిటల్‌, అడిక్‌మెట్‌, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌కు రాకపోకలు సాగించాలి. ఉప్పల్‌ నుంచి అంబర్‌పేట్‌ వెళ్లే వాహనాలను రాయల్‌ జ్యూస్‌ కార్నర్‌, డీడీ కాలనీ, సిండికేట్‌ బ్యాంక్‌, శివం రోడ్డులోకి సాధారణ ట్రాపిక్‌ వెళ్లాలని పోలీసులు సూచించారు. గోల్నాక, మూసారాంబాగ్‌ వెళ్లే వాహనాలను సీపీఎల్‌ అంబర్‌పేట్‌, సల్దాన గేట్‌, అలీ కేప్‌ రూట్‌లో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు.

Exit mobile version