విధాత : ఆహ్లాదకరంగా..హాయిగా ఆకాశంలో విహరిస్తున్న పర్యాటకుల ప్రాణాలు అంతలోనే గాలిలో కలిసిపోయిన విషాదకర ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికి పేలిపోయి మంటలు చెలరేగాయి. మంటల కారణంగా అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలయ్యారు. కొంతమంది మంటలకు తాళలేక కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బెలూన్ లో 21 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన 13 మందిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రయా గ్రాండే అనే నగరల శాంటా కాటరినాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బ్రెజిల్లో ఘోర ప్రమాదం.
హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం పాలయ్యారు.
ప్రమాద సమయంలో బెలూన్లో 21 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం..!!
శాంటా కాటరినాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. pic.twitter.com/2VqmFu7qDU
— greatandhra (@greatandhranews) June 22, 2025