Site icon vidhaatha

Tripura | అసెంబ్లీలో రచ్చ రేపిన బీజేపీ ఎమ్మెల్యే పోర్న్ వీడియో వివాదం

Tripura

విధాత: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్‌నాథ్ గతంలో అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసిన వివాదం మరోసారి ఆ రాష్ట్ర అసెంబ్లీలో రచ్చ రేపింది. ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ జాదవ్ లాల్ పోర్న్ వీడియో చూసి వివాదంపై చర్చించాలని పట్టుబట్టగా, బీజేపీ సభ్యులు ముగిసిన అంశంపై మళ్లీ చర్చ అనవసరమంటు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో టిప్ర మోతా, కాంగ్రెస్‌, సీపీఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. నిరసనకు దిగిన ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభలో నినాదాలతో హోరెత్తించగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నినాదాలు, వాగ్వివాదాలతో సభలో గందరగోళం రేగింది. దీంతో స్పీకర్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు

Exit mobile version