Site icon vidhaatha

TSPSC | న‌వంబ‌ర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 ప‌రీక్ష‌లు..!

TSPSC |

తెలంగాణ‌లో నిర్వ‌హించాల్సిన గ్రూప్-2 ప‌రీక్ష‌ల రీషెడ్యూల్ తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది న‌వంబ‌ర్ 2, 3 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వ‌హించాల్సిన గ్రూప్-2 ప‌రీక్ష‌ల‌ను నిరుద్యోగుల ఆందోళ‌న‌ల‌తో న‌వంబ‌ర్‌కు రీషెడ్యూల్ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

మొత్తం నాలుగు పేప‌ర్ల‌ను ఉద‌యం 10 నుంచి 12:30 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 2, 3 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

ప‌రీక్ష‌ల‌కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల‌కు 5,51,943 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం విదిత‌మే.

Exit mobile version