Site icon vidhaatha

Tulam Gold: మహిళలకు.. తులం బంగారం, రూ.2500ల అమలుపై కీలక అప్డేట్

Tulam Gold : తులం బంగారంతో పాటు మహిళలకు రూ.2500ల ఆర్థిక సహాయం పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి అమలు చేయడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కల్యాణ లక్ష్మి పథకం కొనసాగిస్తున్నారా.. పథకం గైడ్ లైన్స్ మార్చారా అన్న ప్రశ్నలతో పాటు ఎన్నికలలో ఇచ్చిన హామీలు తులం బంగారం హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.

కవిత ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగిస్తున్నామని.. బకాయిలను కూడా చెల్లించామన్నారు. కల్యాణ లక్ష్మి పేరును కల్యాణమస్తుగా మార్చినప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందులోని తులం బంగారం, అలాగే మహిళలకు ఇస్తామన్న రూ.2500 పథకాల అమలు ప్రస్తుతానికి అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడ్డాక ఆయా పథకాల అమలు ప్రారంభిస్తామని చెప్పారు.

మంత్రి పొన్నం సమాధానంపై కవిత స్పందిస్తూ మహిళలను ఎన్నికల్లో తులం బంగారం, రూ.2500ల పథకాల హామీలతో మోసం చేసిందంటూ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎస్.వాణిదేవి మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Exit mobile version