Site icon vidhaatha

Twin explosions | గోకుల్ చాట్‌, లుంబినీ పార్కు పేలుళ్ల నిందితులకు పదేళ్ల జైలు

Twin explosions

విధాత: హైద్రాబాద్ లోని గోకుల్ చాట్‌, లుంబినీ పార్కు జంట పేలుళ్ల నిందితులు నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తు ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది. ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హైద్రాబాద్‌కు చెందిన ఒబేదూర్ రహ్మన్‌తో పాటు ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలాం, ఇమ్రాన్ ఖాన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

వారికి హైద్రాబాద్ జంట పేలుళ్లతో పాటు వారణాసి, ముంబై, ఫైజాబాద్‌, లక్నో, జైఫూర్‌, బెంగుళూర్‌, చెన్నై సిరీయల్ పేలుళ్లలోనూ ప్రమేయం ఉందని కోర్టు నిర్ధారించింది. ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ తరుపునా దేశంలోని ఆయా ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలో భాగమైనందునా వారికి కోర్టు శిక్ష విధించింది.

42మందిని బలిగొన్న ఉగ్రదాడి

హైద్రాబాద్‌లో కోఠిలోని రద్దీ ప్రాంతం గోకులా్ చాట్ దుకాణం వద్ధ, లూంబినీ పార్కులో 2007 ఆగస్టు 15న ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులలో 42 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా పెను సంచ‌లనం సృష్టించిన ఈ జంట పేలుళ్ల ఘటనలో గోకుల్ చాట్ దుకాణం వద్ధ పేలుడులో ౩౩మంది మృతి చెందగా, లుంబినీ పార్కు పేలుడులో 9 మంది మరణించారు.

రెండుచోట్ల జరిగిన వరుస పేలుళ్లలో మరెందరో తీవ్ర గాయాలపాలై అంగవికలులయ్యారు. తదనంతరం 2013 ఫిబ్రవరి 21న దిల్‌షుక్ నగర్‌లోనూ ఉగ్రవాదులు మరోసారి తెగబడి నిత్యం రద్ధీ గా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ధ, బస్టాండ్ వద్ధ పేలుళ్లకు పాల్పడిన ఘటనలో 17మంది మృతి చెందారు.

వందమంది వరకు గాయాలపాలయ్యారు. ఆ దాడులకు సంబంధించి ఇండియన్ ముజాహిదిన్ సంస్థకు చెందిన ఐదుగురు నిందితులను అప్పట్లో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. గురువారం ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు గోకుల్ చాట్‌, లుంబిన్ పార్కు కేసులో నలుగురు ముజాహిదిన్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చి పదేళ్ల శిక్ష విధించడం గమనార్హం.

Exit mobile version