MLA Rajaiah |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, అదే పార్టీకి చెందిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరి అంశంలో కొత్త ట్విస్టులు జరుగుతున్నాయి.
జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల జోక్యం
దీనిపై పోలీసులు విచారణ చేస్తుండగానే తాజాగా నవ్య కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ మేరకు పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీసు శాఖను ఆదేశించాయి.
ఇదిలా ఉంటే కాజీపేట ఏసీపీ శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు దగ్గర పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో నవ్య ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంకంగా మారాయి.