Site icon vidhaatha

High Court | SC, ST కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకం చేప‌ట్టండి: హైకోర్టు

High Court

హైద‌రాబాద్‌, విధాత: ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకం చేపట్టి 6 వారాల్లో నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకాన్ని చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్‌. గణేశ్‌రావుతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ సభ్యుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో భర్తీ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. అయితే ఆరు వారాలు సమయం ఇస్తున్నామని.. ఈలోగా నియామకం చేపట్టి ఆ నివేదికను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Exit mobile version