Site icon vidhaatha

Vangaveeti Radha | రాధా పెళ్లి.. జనసేన నాయకుడి అల్లుడిగా వంగవీటి!

Vangaveeti Radha |

విధాత: వంగవీటి రాధాక్రిష్ణ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నారు. తెలుగుదేశంలో ఉన్న ఆయన ఆశ్చర్యంగా జనసేన నాయకుడి కుమార్తెను పెళ్లాడుతున్నారు. ఈ మేరకు ఆయన నిశ్చితార్థం ఆదివారం జరిగింది. అక్టోబర్ 22న రాధా వివాహం జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆయన నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లిని పెళ్ళాడుతున్నారు.

రాధా అత్త అమ్మానీ టీడీపీ జమానాలో 1987లో నర్సాపురం మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక బాబ్జీ కూడా టీడీపీ నేతగా చాలా కాలం ఉన్నారు. ఆయన కొంతకాలం హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసి ఈ మధ్యనే మళ్ళీ నర్సాపురం తిరిగి వచ్చారు.

ప్రస్తుతం ఆయన నర్సాపురంలో జనసేన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. నర్సాపురంలో పార్టీకి ఆయనే పెద్దదిక్కుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన వారాహి యాత్ర పశ్చిమ గోదావరిలో చేపట్టినపుడు ఆయన ఇంట్లోనే బస చేశారు.

రాధాతో ఈ వివాహానికి జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు కూడా మధ్యవర్తిత్వం వహించారు అని అంటున్నారు. ఇక పెళ్లి తరువాత ఆయన జనసేన తరఫున పోటీ చేస్తారా అనే చర్చ నడుస్తోంది.

విజయవాడ సెంట్రల్ సీటును రాధా కోరుతుండగా అక్కడ ఉన్న బోండా ఉమా దానికి అంగీకరించడం లేదు. గతంలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన బోండా ఉమా మళ్ళీ తను పోటీకి రెడీ అవుతున్నారు. మరి రాధా ను తెలుగుదేశం ఏ విధంగా వినియోగించుకుంటుందో చూడాలి. లేదా జనసేన నుంచి బరిలోకి దిగుతారని కూడా వార్తలు వస్తున్నాయ్.

Exit mobile version