Vedanta-Foxconn | వేదాంతకు షాక్‌ ఇచ్చిన ఫాక్స్‌కాన్‌..! సెమీ కండక్టర్ల డీల్‌ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన..!

Vedanta-Foxconn | భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్స్‌తో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి వేదాంతతో ఒప్పందంపై ఫాక్స్‌కాన్‌ వెనుకడు వేసింది. గతేడాది రూ.1.5లక్షల కోట్ల (19.5 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో చేసుకున్న డీల్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణాలను మాత్రం ప్రకటించలేదు.  వేదాంతతో డిస్‌ప్లేల తయారీకి వినియోగించే సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఉత్పత్తి ప్లాంట్‌ […]

  • Publish Date - July 11, 2023 / 02:10 AM IST

Vedanta-Foxconn | భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్స్‌తో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి వేదాంతతో ఒప్పందంపై ఫాక్స్‌కాన్‌ వెనుకడు వేసింది. గతేడాది రూ.1.5లక్షల కోట్ల (19.5 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో చేసుకున్న డీల్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణాలను మాత్రం ప్రకటించలేదు. వేదాంతతో డిస్‌ప్లేల తయారీకి వినియోగించే సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఉత్పత్తి ప్లాంట్‌ జాయింట్‌ వెంచర్‌ ఒప్పందాన్ని కొనసాగించబోవడం లేదని ఫాక్స్‌కాన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

మోదీ సర్కారు చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మద్దతు ఇస్తామని తెలిపింది. వేదాంత యాజమాన్యంలోని యూనిట్‌ నుంచి హాన్ హై టెక్నాలజీ గ్రూప్ ఫాక్స్‌కాన్‌ పేరును తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. వేదాంతతో దాదాపు ఏడాది పాటు ఫాక్స్‌కాన్‌ కలిసి పని చేసింది. కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ రెండు కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించాయి. గతవారంలో అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత గ్రూప్‌ సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన జాయింట్‌ వెంచర్‌ను హోల్డింగ్‌ కంపెనీని స్వాధీనం చేసుకోనున్నట్లు పేర్కొంది. అయితే, డీల్ బ్రేక్‌డౌన్‌పై కేంద్రమంత్రి స్పందించారు.

వేదాంతతో జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలగాలని ఫాక్స్‌కాన్‌ తీసుకున్న నిర్ణయం భారతదేశ సెమీకండక్టర్ ఫ్యాబ్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం చూపదని రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గతేడాది సెప్టెంబర్‌ 13న గుజరాత్‌ గాంధీనగర్‌లో గుజరాత్‌ ప్రభుత్వం, వేదాంత, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ గ్రూప్‌ మధ్య ఎంఓయూ కుదిరింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌, సీఎం భూపేంద్ర పటేల్‌ ఎదుట ఒప్పందం జరిగింది. గుజరాత్‌లో యూనిట్లు నెలకొల్పేందుకు రెండు కంపెనీలు రూ.1,54,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, దాంతో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆ సమయంలో ప్రకటించారు.

Latest News