Rainfall | 122 ఏండ్ల‌లో ఈ ఆగ‌స్టే దారుణం.. చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రికార్డు

Rainfall | అతిత‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు ఎల్ నినో ప్రభావమూ ఒక కార‌ణం ఆగ‌స్టు నెల‌లో పుష్క‌లంగా వ‌ర్షాలు కురుస్తాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతాయి. దేశ‌వ్యాప్తంగా వాన‌లు స‌మృద్దిగా కురిసే నెల‌గా ఆగ‌స్టు నెలకు ఇప్ప‌టివ‌ర‌కు మంచి రికార్డే ఉన్న‌ది. కానీ, ఈ ఆగ‌స్టు దారుణంగా మారింది. వేస‌విని త‌లపించేలా ఎండ‌లు దంచాయి. వాన‌లు స‌రిగ్గా ప‌డ‌నేలేదు. 1901 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అతి త‌క్కువ వ‌ర్షపాతం ఈ ఆగ‌స్టులోనే న‌మోదైంది. గ‌డిచిన 122 ఏండ్ల చ‌రిత్రలో ఈ […]

  • Publish Date - September 2, 2023 / 02:26 PM IST

Rainfall |

  • అతిత‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు
  • ఎల్ నినో ప్రభావమూ ఒక కార‌ణం

ఆగ‌స్టు నెల‌లో పుష్క‌లంగా వ‌ర్షాలు కురుస్తాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతాయి. దేశ‌వ్యాప్తంగా వాన‌లు స‌మృద్దిగా కురిసే నెల‌గా ఆగ‌స్టు నెలకు ఇప్ప‌టివ‌ర‌కు మంచి రికార్డే ఉన్న‌ది. కానీ, ఈ ఆగ‌స్టు దారుణంగా మారింది. వేస‌విని త‌లపించేలా ఎండ‌లు దంచాయి. వాన‌లు స‌రిగ్గా ప‌డ‌నేలేదు.

1901 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అతి త‌క్కువ వ‌ర్షపాతం ఈ ఆగ‌స్టులోనే న‌మోదైంది. గ‌డిచిన 122 ఏండ్ల చ‌రిత్రలో ఈ డ్రాట్ ప‌రిస్థితి ఇంత‌కు ముందెన్న‌డూ ఎదురుకాలేదు. వాతావ‌ర‌ణ‌, వ‌ర్ష‌పాత రికార్డుల‌న్నింటీని ఈ ఆగ‌స్టు చెరిపేసింది. వ‌ర్షాలు లేని చెత్త రికార్డును చ‌రిత్ర‌లో లిఖించుకున్న‌ది.

వ‌ర్షాకాల సీజ‌న్‌లో ఆగ‌స్టు నెల‌లో వ‌ర్షాలు బాగా కురుస్తాయి. పుష్క‌ల‌మైన వాన‌ల‌తో ఎటుచూసినా ప‌చ్చని పంట‌ల‌తో ప్ర‌కృతి క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఈ ఆగ‌స్టు తీవ్ర డ్రాట్ నెల అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్న‌ది. మధ్య భారతంలో గానీ, దక్షిణ భారతంలో గానీ ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం న‌మోదైంది. ఈ విష‌యాన్నిస్వ‌యంగా భార‌త‌ వాతావరణ విభాగమే వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

దేశవ్యాప్తంగా ఆగ‌స్టులో నమోదు అయిన కనీస వర్షపాతం 191.2 మి.మీ. గరిష్ఠ వర్షపాతం 192.3 మి.మీలుగా 1965 లో నమోదు చేశారు. అంటే 1901 నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఇదే ఆగస్టు నెలల్లో ఎప్పుడూ 191.2 మి.మీ మించి వ‌ర్ష‌పాతం న‌మోదు అయిందే త‌ప్పితే ఎప్పుడూ ఇంత కంటె లోటు వ‌ర్షపాతం న‌మోదు కాలేదు.

కానీ, ఈ ఆగ‌స్టులో 191.2 కంటే త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైన అత్యంత త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదైన నెల‌గా చెత్త రికార్డు నెల‌కొల్పింది. ఆగస్టు లో రెండు ద‌ఫాల్లో వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 5 నుంచి 16 వరకు, ఆగస్టు 27 నుంచి 31 వరకు వాన‌లు ప‌డ‌తాయి. కానీ, అలా ఈ సారి వ‌ర్షాలు ప‌డ‌లేదు.

వర్షకాల సీజన్ లో ఉత్తరభారత మైదాన ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా కురిసి అక్కడి సాధారణ పరిస్థితులను అస్తవ్యస్తం చేస్తూ ప్రజాజీవనానికి ఆటంకంగా తయారవుతుంది. ఈ సారి కూడా అరుణాచ‌ల్‌, ఉత్త‌రాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి నెలకొన్న‌ది.

మ‌న రాష్ట్రంలో వ‌ర్ష ప్ర‌భావ‌మే క‌నిపించ‌లేదు. కారణం ఎల్ నినో ప్రభావం వర్షాలపై బలంగా పనిచేస్తున్నది. దాని వల్ల వర్షాలు కరువవుతున్నవి. ఇదే కాకుండా మాడ్డెన్ జులియన్ ఒసిలేషన్ అనే విపత్తి కూడా మరొక కారణం అని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మహాపాత్ర తెలిపారు.

సెప్టెంబర్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం

సెప్టెంబర్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. 1971 నుంచి 2020 మధ్య జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడిన వర్షాల స‌గ‌టును లెక్కిస్తే 87 సెంటిమీటర్లుగా మోదయ్యింది. దీన్ని బట్టే 4 సె.మీ అటు, ఇటుగా సాధారణ వర్షపాతం 96 శాతం అనేది ఐఎండీ భావిస్తుంది.

ప్రైవేట్ వాతావరణ విభాగం స్కైమేట్ కూడా ఈ ఏడాది దాదాపు సాధారణ కన్నా తక్కువ వర్షాలే పడవచ్చు అని తెలిపింది. దేశంలోని పశ్ఛిమ-దక్షిణ ప్రాంతం పై ఎల్ నినో ప్రభావం వర్షాలపై బలంగా ఉన్న‌ది. భూమధ్యరేఖకు తూర్పున ఉన్న ఫసిఫిక్ మహాసముద్రంపై ఈఎల్ నినో సంవత్సరాల్లో దాని ప్రభావం విపరీతంగా ఉండి సముద్రం నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది.

దీని ఫలితంగా దేశంలో వేసవి కాలం అతివేడి, వర్షాల సీజన్ లో బలహీన రుతుపవనాలు సంభవిస్తాయి. ప్రస్తుత ఈ ఆగస్టు లో కూడా వర్షాలు ఇంత తక్కువ స్థాయి లో రికార్డు అవడానికి గల కారణం కూడా ఇదేనని ఐఎండీ డైరెక్టర్ వివరించారు.

Latest News