Holidays in August | ఆగ‌స్టులో సెల‌వులే సెల‌వులు.. విద్యార్థుల‌కు పండుగే పండుగ‌..

Holidays in August | ఆగ‌స్టు( August ) నెల అంద‌రికీ పండుగే. ఎందుకంటే ఈ ఒక్క నెల‌లోనే బోలెడ‌న్నీ సెలవులు( Holidays ) రానున్నాయి. ఒక‌ట్రెండు రోజులు కాదు.. ఏకంగా ప‌దుల సంఖ్య‌లో సెల‌వులు ఉన్నాయి. మ‌రి ఆ వివ‌రాలు తెలుసుకుందాం..

Holidays in August | హైద‌రాబాద్ : అటు స్కూల్ స్టూడెంట్స్( School Students ).. ఇటు ప్ర‌భుత్వ ఉద్యోగులు( Govt Employees ) సెల‌వుల కోసం ఎదురు చూస్తుంటారు. ఏ నెల‌లో ఎన్ని సెల‌వులు( Holidays ) వ‌స్తున్నాయి.. ఆ సెల‌వు దినాల్లో ఎక్క‌డికి వెళ్లాల‌నే ప్లానింగ్ చేసుకుంటుంటారు ఉద్యోగులు. పిల్ల‌లు మాత్రం సెల‌వు దినాల్లో ఆడుకునేందుకు అవ‌కాశం దొరుకుతుంద‌ని ఎగిరి గంతేస్తారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు( August ) నెల అటు పిల్ల‌ల‌కు, ఇటు ఉద్యోగుల‌కు, త‌ల్లిదండ్రుల‌కు క‌లిసి రానుంది. ఎందుకంటే ఈ నెల‌లో 10 రోజులు సెల‌వులు రానున్నాయి. మొత్తం 31 రోజులు ఉండ‌గా, ఇందులో సెల‌వులు 10 రోజులు తీసేస్తే ప‌ని దినాలు కేవ‌లం 21 రోజులే.

ఆగ‌స్టు మాసంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం( Varalakshmi Vratam ), వినాయ‌క చ‌వితి( Vinayaka chavithi ), పంద్రాగ‌స్టు( Independence Day ), శ్రీకృష్ణాష్ట‌మి, రాఖీ పండుగ‌( Rakhi Festival ) వంటి పండుగ‌లు రానున్నాయి. ఈ పండుగ‌ల‌తో పాటు ఆదివారాలు( Sundays ), రెండో శ‌నివారం క‌లిపి మొత్తం 10 రోజులు సెల‌వులు ల‌భించ‌నున్నాయి. దీంతో పిల్ల‌లు ఎంతో ఎంజాయ్ చేసేందుకు అవ‌కాశం రానుంది. ఉద్యోగులు కూడా విహార‌యాత్ర‌లు ప్లానింగ్ చేసుకోవ‌చ్చు. మ‌రి ఆగ‌స్టు నెల‌లో ఎప్పుడెప్పుడు సెల‌వులు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగ‌స్టు నెల‌లో సెల‌వులు ఇలా..

03.08.2025 – ఆదివారం
08.08.2025 – వరలక్ష్మీ వ్రతం
09.08.2025 – రెండవ శనివారం, రాఖీ పండుగ‌
10.08.2025 – ఆదివారం
15.08.2025 – పంద్రాగ‌స్టు
16.08.2025 – శ్రీకృష్ణాష్టమి
17.08.2025 – ఆదివారం
24.08.2025 – ఆదివారం
27.08.2025 – వినాయక చవితి
31.08.2025 – ఆదివారం

మొత్తం రోజులు : 31
సెలవు దినాలు : 10
పని దినాలు : 21