Vijaya Milk | సామాన్యుడికి బిగ్ షాక్.. పెరిగిన విజ‌య డెయిరీ పాల ధ‌ర‌లు

Vijaya Milk విధాత‌: ఇప్ప‌టికే నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌లతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సామాన్యుడికి మ‌రో షాక్ త‌గిలింది. విజ‌య డెయిరీ పాల (Vijaya Dairy Milk) ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి స‌హ‌కార స‌మాఖ్య సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. లీట‌ర్ టోన్డ్ మిల్క్‌పై రూ. 3 పెంచింది. దీంతో టోన్డ్ మిల్క్ లీట‌ర్ ధ‌ర రూ. 51 నుంచి రూ. 55కు పెరిగింది. డ‌బుల్ టోన్డ్ మిల్క్ ధ‌ర హాఫ్ లీట‌ర్ గ‌తంలో […]

  • Publish Date - April 3, 2023 / 01:31 PM IST

Vijaya Milk

విధాత‌: ఇప్ప‌టికే నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌లతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సామాన్యుడికి మ‌రో షాక్ త‌గిలింది. విజ‌య డెయిరీ పాల (Vijaya Dairy Milk) ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి స‌హ‌కార స‌మాఖ్య సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

లీట‌ర్ టోన్డ్ మిల్క్‌పై రూ. 3 పెంచింది. దీంతో టోన్డ్ మిల్క్ లీట‌ర్ ధ‌ర రూ. 51 నుంచి రూ. 55కు పెరిగింది. డ‌బుల్ టోన్డ్ మిల్క్ ధ‌ర హాఫ్ లీట‌ర్ గ‌తంలో రూ. 26 ఉండ‌గా, ధ‌ర పెంపుతో రూ. 27కు చేరింది.

అయితే పాల ధ‌ర‌ల‌ను పెంచే ముందు ప్ర‌భుత్వం పాడి రైతుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తుంది. పాడి రైతుల‌తో చ‌ర్చించిన అనంత‌రం పాల ధ‌ర‌ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంది. కానీ ఈసారి ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌కుండానే పాల ధ‌ర‌లు పెంచేసింది.

నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు రవాణా, పాల సేకరణ ధరలు కూడా పెరగడంతో అనివార్యంగా ధరలు పెంచాల్సి వచ్చిందని విజయ డెయిరీ ఓ ప్రకటనలో వెల్లడించింది