Viral Video | లేగ‌దూడ‌పై చిరుత దాడి.. త‌రిమికొట్టిన గోమాత‌..

Viral Video | బిడ్డ ప్రాణ‌ప్రాయ స్థితిలో ఉంటే.. ఆ బిడ్డ‌ను కాపాడుకునేందుకు త‌ల్లి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అవ‌స‌ర‌మైతే తల్లి త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టేందుకు కూడా వెనుకాడ‌దు. త‌ల్లీబిడ్డ‌ల మ‌ధ్య ఉన్న పేగుబంధం అది. ఆ మాదిరిగానే ప‌శుప‌క్షాదుల్లోనూ త‌ల్లి ప్రేమ‌కు ఎల్ల‌లు లేవు అనే దానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. గోవుల గుంపు మేత మేస్తుండ‌గా.. ఓ చిరుత పులి అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక గోవుల‌పై దాడి చేసేందుకు చిరుత య‌త్నించింది. కొంత‌దూరం వ‌ర‌కు […]

  • Publish Date - April 23, 2023 / 05:43 AM IST

Viral Video |

బిడ్డ ప్రాణ‌ప్రాయ స్థితిలో ఉంటే.. ఆ బిడ్డ‌ను కాపాడుకునేందుకు త‌ల్లి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అవ‌స‌ర‌మైతే తల్లి త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టేందుకు కూడా వెనుకాడ‌దు. త‌ల్లీబిడ్డ‌ల మ‌ధ్య ఉన్న పేగుబంధం అది. ఆ మాదిరిగానే ప‌శుప‌క్షాదుల్లోనూ త‌ల్లి ప్రేమ‌కు ఎల్ల‌లు లేవు అనే దానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం.

గోవుల గుంపు మేత మేస్తుండ‌గా.. ఓ చిరుత పులి అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక గోవుల‌పై దాడి చేసేందుకు చిరుత య‌త్నించింది. కొంత‌దూరం వ‌ర‌కు గోవుల‌ను చిరుత వెంబ‌డించింది. అయితే అక్క‌డున్న ఓ లేగ‌దూడ‌పై చిరుత క‌న్ను ప‌డింది. దీంతో ఆ లేగ‌దూడ‌ను చిరుత వెంబ‌డించింది.

లేగ‌దూడ‌ను త‌న నోటితో అదిమిప‌ట్టి, క‌ర‌వ‌బోతుండ‌గానే.. అల్లంత దూరంలో ఉన్న గోమాత అప్ర‌మ‌త్త‌మైంది. ఒక్క ఉదుటున గోమాత ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి.. చిరుత‌ను త‌రిమికొట్టింది. లేగ‌దూడ‌ను అక్క‌డే వదిలేసిన చిరుత‌.. అక్క‌డ్నుంచి పారిపోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లో వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్(Viral) అవుతుంది.