Site icon vidhaatha

Viral Video | హైనా గుండెల్లో ద‌డ పుట్టించిన జిరాఫీ..

Viral Video | త‌మ పిల్ల‌లు ప్ర‌మాదంలో ఉన్నారంటే.. వారిని ప్రాణాల‌తో ర‌క్షించుకునేందుకు త‌ల్లి ఎంత‌టి వ‌ర‌కైనా పోరాడుతోంది. అవ‌స‌ర‌మైతే త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి పిల్ల‌ల‌ను ప్ర‌మాదం నుంచి కాపాడుకుంటుంది. ఆ మాదిరిగానే ఓ జిరాఫీ కూడా త‌న పిల్ల ప్రాణాల‌ను కాపాడుకుంది.

అడ‌విలో ఓ జిరాఫీ త‌న పిల్ల జిరాఫీతో క‌లిసి ఆకులు తింటూ ఉంటుంది. అంత‌లోనే అక్క‌డికి ఓ హైనా వ‌చ్చింది. అయితే మాంసాహారి అయిన హైనా.. పిల్ల జిరాఫీపై దాడి చేసి భ‌క్షించేందుకు య‌త్నించింది. ప‌సిగ‌ట్టిన త‌ల్లి హైనా.. త‌న పిల్ల ప్రాణాల‌ను కాపాడుకునేందుకు హైనాను బెదిరించింది. ఒక్క‌సారిగా త‌న కాళ్ల‌తో ముంద‌డుగు వేసి హైనా గుండెల్లో ద‌డ పుట్టించింది జిరాఫీ. దీంతో హైనా అటు నుంచి పారిపోయింది.

Exit mobile version