Site icon vidhaatha

Voter List | ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రభుత్వ నిర్లక్ష్యం: నిరంజన్

Voter List

విధాత: ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌ ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలకు స్పెషల్‌ సమ్మరి రిలీజ్‌ చేశారని, అక్టోబర్ 4 న తుది జాబితా విడుదల చేస్తారని తెలిపారు.

దీని ప్రకారం 25 మే నుండి 23 జూన్ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్ట్ లో ఉన్న పేర్లు వెరిఫై చేయాలి కానీ, క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్‌ జరుగడం లేదన్నారు. ఓటర్ల జాబితా పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, జూన్ 2నుండి 22 వరకు ఆవిర్భావ ఉత్సవాలకు అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ఉపయోగిస్తుని తెలిపారు.

ఓటర్ల జాబితా కూడా వీరే వెరిఫై చేయాల్సి ఉందని, కానీ చేయడం లేదన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల కమిషన్ కి లెటర్ రాస్తున్నామన్నారు. ఓటర్ల జాబితా విడుదల షెడ్యూల్ ని మార్చాలని కోరుతామన్నారు. ఈ మేరకు 22 న హైదరాబాద్‌కు వస్తున్న డిప్యుటీ ఎన్నికల కమిషన్ కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.

తెలంగాణలో ఆంధ్రాలో ఉండే వారి ఓట్లు కూడా ఉన్నాయన్నారు. ఒక్కో ఫొటో తో రెండు నుండి మూడు ఓట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలో ఫొటో సిమిలర్ ఓట్లను తొలగించిన తరువాత నే తుది జాబితా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నామని తెలిపారు.

Exit mobile version