WARANGAL |
బురిడీ కొట్టించిన డిప్యూటీ మేనేజర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ తాను పనిచేసే బ్యాంకునే మోసం చేశారు. తన చేతివాటం ప్రదర్శించారు. బ్యాంకును బురిడి కొట్టించి సుమారు రూ. 8.5 కోట్లు కొల్లగొట్టాడు.
ఈ ఘనుడు చేసిన పనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖాతాదారుల పేరిట కార్తీక్ బంగారం రుణాలు పొందినట్లు ఆడిటింగ్ లో బయట పడింది.
డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ పై బ్యాంకు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీస్ అధికారులు చెబుతున్నారు.