Site icon vidhaatha

Warangal | పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు మృతి

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఈనెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా పెళ్ళికొడుకు మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందిన సంఘటన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. వరంగల్ నగరంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ 29 వ డివిజన్ రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్ అనే యువకుడి పెళ్లి 12 వ తేదీన ఉంది. మంగళవారం నిర్మలామాల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో వ‌రుడు సాగ‌ర్ మృతిచెందడంతో పెళ్లింట చావుడప్పు మోగింది.

మృతుడు విశ్వకర్మ డెవలప్మెంట్ పరపతి సంఘం అధ్యక్షులు కృష్ణకు కుమారుడు. విషయం తెలిసి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఎంజిఎం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగఢ సానుభూతి తెలియజేశారు.

Exit mobile version