Warangal | ఐక్యతతోటే రాజ్యాధికారం సాధ్యం: MLA ఈట‌ల‌

Warangal యుద్ధం చేసే సత్తా ఉన్న బీసీలు అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీసీల్లో ఐక్యత రానంతవరకు రాజ్యాధికారానికి మనం దగ్గర కాలేమంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ లాంటి చైతన్యవంతమైన గడ్డ మీద మనం ఉన్నా ఐక్యత సాధించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో బుధవారం తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం […]

  • Publish Date - May 10, 2023 / 12:03 PM IST

Warangal

  • యుద్ధం చేసే సత్తా ఉన్న బీసీలు
  • అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలి
  • హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీసీల్లో ఐక్యత రానంతవరకు రాజ్యాధికారానికి మనం దగ్గర కాలేమంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ లాంటి చైతన్యవంతమైన గడ్డ మీద మనం ఉన్నా ఐక్యత సాధించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో బుధవారం తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కార్యక్రమం పై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఈట‌ల హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు బీసీలు రాజ్యాధికారానికి నోచుకోలేదన్నారు.

ఓరుగల్లు మొదటి నుంచి చైతన్యానికి మారు పేరుగా నిలుస్తుందని చెప్పారు. అట్టడుగు వర్గాల నుంచి రాజ్యాధికారం సాధించిన రాష్ట్రం బీహార్ అంటూ వివరించారు. అవకాశం వస్తే శక్తి సత్తా చాటగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం బలహీన వర్గాల ప్రజలమన్నారు.

నూటికి నూరు శాతం అణగారిన వర్గాలకు చెందిన రాష్ట్రం తెలంగాణ. అందుకే ఉద్యమ సమయంలో దళితుడు మొదటి ముఖ్యమంత్రి అంటూ కెసిఆర్ ప్రకటించారనీ కానీ అధికారం దగ్గరకు వచ్చిన తరువాత కెసిఆర్ ఎలా వ్యవహరించారో, ఎలా మాట తప్పారో తెలంగాణ సమాజం చూసిందని గుర్తు చేశారు.

బీసీల్లో ఐక్యత లోపించినంత కాలం అధికారానికి మనం దూరం అవుతామని, రాజ్యాంగం సాక్షిగా మన కండ్లలో మన్ను కొట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం అంటూ జరిగితే విజయం సాధించే సత్తా మనకు ఉన్నదని నిరూపించే సమయం ఆసన్నం అవుతుందన్నారు. త్యాగాలు చేసిన వారు అందరూ అణగారిన వర్గాలకు చెందిన వారేనని చెప్పారు. నీ చేతిలో ఉన్న అధికారం దుర్వినియోగం చేసుకోవద్దు.

సేవ చేసే గుణంలో మెరిట్ ఉండాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే మెరిట్ ఉన్న వారే పాలకులు కావాలన్నారు. రాజ్యాంగం పై పట్టు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పని చేసే మనసున్న వారు పాలకులు కావాలన్నారు. అటువంటి నాయకులను ఎన్నుకునే చైత‌న్యం ప్ర‌జ‌ల్లో రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే అంబేద్కర్ కలలు కన్న సమాజం ఆవిష్కృతం అవుతుందని ఈటల అన్నారు.

ప్రొఫెసర్ మురళి మనోహర్ మాట్లాడుతూ రిజర్వేషన్ ను చూపుతూ అణగారిన వర్గాల ప్రజలను చిన్నచూపు చూసిన రోజులని, రాజ్యాధికారం మనకు తెలియకుండానే మన నుంచి జారిపోయిందన్నారు.

బిజెపి నేత కుసుమ సతీష్ మాట్లాడుతూ మన అప్రమత్తత లోపించడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. డబ్బులు లేకుండా పోటీ చేస్తే సపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా చేశారన్నారు. చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి. చైతన్యం రావాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు.

సమావేశంలో బీసీ నేతలు చింతం ప్రవీణ్ కుమార్, అల్లం నాగరాజు రాజయ్య యాదవ్, డాక్టర్ కాళీ ప్రసాద్, వడ్నాల నరేందర్ తదితర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Latest News