TRS | ఇంతకు టీఆర్ఎస్ ఎవరి సొంతం..! పొంగులేటికా.. హరీశరావు అనుచరుడికా?

టీఆర్ఎస్ (TRS) కోసం పొంగులేటి తపన..? విధాత: భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల దిశగా ఏ పార్టీలోకి వెళ్లాలి.. లేక కొత్త పార్టీ పెట్టాలా అన్న మీమాంసతో రాజకీయ చౌరస్తాలో నిలబడిన BRS తిరుగుబాటు నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త పార్టీ పెడితే ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినట్లుగా చెబుతున్న తెలంగాణ రైతు సమాఖ్య(TRS) పేరుతో తన […]

  • Publish Date - May 9, 2023 / 06:10 AM IST
  • టీఆర్ఎస్ (TRS) కోసం పొంగులేటి తపన..?

విధాత: భవిష్యత్తు రాజకీయ లక్ష్యాల దిశగా ఏ పార్టీలోకి వెళ్లాలి.. లేక కొత్త పార్టీ పెట్టాలా అన్న మీమాంసతో రాజకీయ చౌరస్తాలో నిలబడిన BRS తిరుగుబాటు నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా సాగుతున్నాయి.

ఇదే సమయంలో కొత్త పార్టీ పెడితే ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయినట్లుగా చెబుతున్న తెలంగాణ రైతు సమాఖ్య(TRS) పేరుతో తన వర్గం అభ్యర్థులను కనీసంగా 30 నుంచి 40 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలపాలని పొంగులేటి భావిస్తున్నట్లుగా కూడా ప్రచారంలో ఉంది.

అయితే అదే TRS పేరుతో తెలంగాణ రాజ్యసమితి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం మంత్రి టి. హరీష్ రావు ప్రధాన అనుచరుడైన పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం కూడా ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు.

ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మే 27వ తేదీ లోపల తమకు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల సంఘం వద్ద TRS పేరుతో ఉన్న పార్టీ రిజిస్ట్రేషన్ ఎవరికి సొంతమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

పొంగులేటి అనుచరులు మాత్రం ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో పార్టీ రిజిస్టర్ కాబడినట్లుగా చెబుతున్నారు. బాలరంగం కూడా టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీకి దరఖాస్తు చేశారు.

దీంతో అసలు టీఆర్ఎస్ ఎవరిది.. తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్‌తో ముడిపడిన TRS ఎవరి సొంతం అవుతుందన్న ఆసక్తి తలెత్తింది. ఎన్నికల సంఘంలో నమోదు అయినట్లుగా ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ వాస్తవానికి ఎవరి సొంతమన్న సంగతిపై తీవ్ర గందరగోళం నెలకొంది.

పొంగులేటి వర్గీయులు చెబుతున్నట్లుగా ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రైతు సమాఖ్య రిజిస్టర్ కాబడితే అదే టీఆర్ఎస్ పేరుతో బాలరంగం చేసుకున్న తెలంగాణ రాజ్యసమితికి ఎన్నికల సంఘం అనుమతిస్తుందా అన్న ప్రశ్న కూడా నెలకొంది. ఎన్నికల సంఘం స్పష్టతనిస్తే తప్ప టీఆర్ఎస్ పార్టీ పేరుపై నెలకొన్న గందరగోళం అప్పటిదాకా కొనసాగనుందని భావిస్తున్నారు.

TRS | షాకింగ్‌ న్యూస్‌: ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్..! దరఖాస్తుదారుడు హరీశ్‌రావు ప్రధాన అనుచరుడే!