Site icon vidhaatha

Kurnool | బ‌ల‌వంతంగా ముద్దు.. భ‌ర్త నాలుక కొరికేసిన భార్య‌.. ఆస్పత్రికి తరలింపు

Kurnool |

విధాత: భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జం. కానీ ఈ దంప‌తుల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం.. భ‌ర్త నాలుక కొరికేసేందుకు దారి తీసింది. బ‌ల‌వంతంగా భ‌ర్త ముద్దు పెట్టేందుకు య‌త్నించ‌డంతోనే అత‌ని నాలుక కొరికేశాన‌ని భార్య చెప్పుకొచ్చింది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయ‌క్.. క‌ర్నూల్ జిల్లా తుగ్గ‌లి మండ‌లానికి చెందిన పుష్ప‌వ‌తిని 2015లో ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌రుచుగా గొడ‌వ‌లు జ‌రిగేవి.

శుక్ర‌వారం ఉద‌యం కూడా ఇరువురి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. బ‌ల‌వంతంగా ముద్దు పెట్టేందుకు య‌త్నించిన భ‌ర్త‌ నాలుకను గ‌ట్టిగా కొరికేసింది భార్య‌. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ ప‌డుతున్న బాధితుడిని.. స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం అనంత‌రం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే త‌న‌పై దాడి చేసి, త‌న‌కు ఇష్టం లేకుండా, బ‌ల‌వంతంగా ముద్దు పెట్టేందుకు వ‌చ్చినందుకే ఇలా జ‌రిగింద‌ని భార్య పుష్ప‌వ‌తి.. జొన్న‌గిరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నా భార్య‌కు ఎఫైర్ ఉంది : తారాచంద్

మేమిద్ద‌రం ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నామ‌ని బాధితుడు తారాచంద్ తెలిపాడు. తాము మంచిగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో నెల నెల మా నాన్న డ‌బ్బులు పంపుతున్నాడు. కానీ త‌న భార్యకు ఆమె ఊర్లో ఎఫైర్ ఉంద‌ని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ స‌ర్దుకుపోయాను. ఇవాళ నా నాలుక కోసింది.. చంపేస్తుందేమోన‌ని భ‌యంగా ఉంద‌ని తారాచంద్ వాపోయాడు.

Exit mobile version