Site icon vidhaatha

Wines Closed | మందుబాబుల‌కు షాక్‌.. రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్!

Wine Shops Closed : మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్ తెలిపింది. శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా రేపు ఆదివారం(ఏప్రిల్ 6) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని వైన్సులు, బార్లతో పాటు కల్లు దుకాణాలు కూడా బంద్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు కూడా  ఈ ఆదేశాలను పాటించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని  తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. వైన్ షాపులు రేపు బంద్ అన్న వార్త ప్రచారంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. తెలంగాణలో ఎండలు పెరిగిన నేపథ్యంలో మందుబాబులు చల్లటి బీర్ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో కొన్ని వైన్ షాపుల్లో బీర్ల స్టాక్ కూడా అయిపోయింది.

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఊరూరా..వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవాలను సంబరంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలో రామాలయాలను శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబు చేశారు. అటు భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

Exit mobile version