Naveen’s murder
విధాత: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు నిహారికను అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీలో విచారణ సందర్భంగా హరిహర కృష్ణ తన ప్రియురాలి కోసమే నవీన్‌ను తాను హత్య చేసినట్లు చెప్పాడు.
దీంతో ఆమెను కూడా కేసులో భాగంగా అరెస్టు చేశారు. నవీన్ హత్య కేసులో పోలీసులు ఎ1గా హరిహర కృష్ణను, ఎ2గా అతని మిత్రుడు హసన్ ను, ఏ3గా నిహారిక పేర్లను నిందితులుగా చేర్చారు.
అయితే.. మొదట పోలీసుల విచారణకు సహరించని హరిహరకృష్ణ గర్ల్ ఫ్రెండ్.. తనను ఒత్తిడి చేస్తే సూసైడ్ చేసుకుంటానని కూడా బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం.. హరిహరకృష్ణను, అతని గర్ల్ ఫ్రెండ్‌ను విడివిడిగా విచారించగా.. విస్తుపోయే విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
అయితే.. హరిహరకృష్ణ హత్య చేసిన తర్వాత.. ఆ విషయాన్ని తన ప్రియురాలితో పాటు ఫ్రెండ్‌కు కూడా చెప్పాడు. కానీ.. ఈ విషయాన్ని మాత్రం ఇద్దరూ.. ఎవరికీ చెప్పలేదు. హసన్ ఓపెన్ అయినా.. హత్య చేసిన తర్వాత తన దగ్గరికి వచ్చాడని మాత్రమే చెప్పాడు. కానీ.. తాను మృతదేహాన్ని చూసినట్టుగా చెప్పలేదు. మరోవైపు.. హరిహరకృష్ట ప్రియురాలు మాత్రం అసలు తనకు ఏమీ తెలియదంటూ బుకాయించటం గమనార్హం.
కాగా.. నవీన్ హత్య విషయం తమకు తెలిసి కూాడా.. పోలీసులకు చెప్పకపోవటాన్ని కూడా నేరంగా పరిగణించిన పోలీసులు.. వాళ్లిద్దరినీ నిందితులుగా చేర్చారు. అయితే.. ఈ విషయంపై స్పందించిన ఎల్బీనగర్ డీఎస్పీ.. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని తెలిపారు.
అమ్మాయితో పాటు హసన్‌కు కూడా నవీన్ హత్య గురించి తెలిసినా కూడా పోలీసులకు చెప్పక పోవటంతో.. ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నవీన్ హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి ముగ్గురు వెళ్లారని తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.