Viral Video | మద్యం మత్తులో మగాళ్లు చిందులు వేయడం, దాడులు చేయడం చూశాం. కానీ ఓ నలుగురు మహిళలు మాత్రం మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. ఓ యువతిపై పంచుల వర్షం కురిపించారు. కాపాడండి అంటూ వేడుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో ఓ నలుగురు యువతులు హల్ చల్ చేశారు. పబ్ లో పీకల దాకా మద్యం సేవించి, బయటకు వచ్చి హంగామా సృష్టించారు. నలుగురు కలిసి మరో యువతిపై దాడికి దిగారు. పంచుల వర్షం కురిపించారు. కాళ్లతో తన్నారు. బెల్టులతో చితకబాదారు. కర్రలతో కొట్టారు.
ఆ దెబ్బలు భరించలేక కాపాడంటూ బాధితురాలు వేడుకున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా కనికరించలేదు. రహదారిపై చాలా మంది నిల్చుని చూశారే తప్ప.. బాధితురాలిని చేర దీయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ యువతిపై ఎందుకు దాడి చేశారనే విషయం తెలియ రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
उड़ता इंदौर.. नशे में धुत्त लड़कियों का पब के बाहर मारपीट का वायरल वीडियो @IndoreCollector @hariips @drnarottammisra pic.twitter.com/jcSKohDEve
— Brajesh Rajput (@brajeshabpnews) November 7, 2022