Site icon vidhaatha

Delhi | ఢిల్లీలో మ‌రో ఘోరం.. మ‌హిళ శ‌రీర భాగాల‌ను క‌నుగొన్న పోలీసులు

Delhi

విధాత‌: శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య అయిన త‌ర్వాత ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం జ‌రుగుతోంది. తాజాగా దిల్ల‌లోని గీతా కాల‌నీ ఫ్లై ఓవ‌ర్ ప్రాంతంలో మ‌హిళ శ‌రీర భాగాల‌ను బుధ‌వారం క‌నుగొన్నారు. ఉద‌యం ఈ ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకుని వెళ్లిన పోలీసుల‌కు అక్క‌డో శ‌రీర భాగం.. ఇక్క‌డో శ‌రీర భాగం అన్న‌ట్లు క‌నిపించాయి.

గ‌తేడాది జ‌రిగిన శ్ర‌ద్ధా వాక‌ర్ (27) హ‌త్య దిల్లీతో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా శ్ర‌ద్ధాను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి అడ‌విలో చెల్లా చెదురుగా విసిరేశాడు. ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌కుండా ఆమె ముఖాన్ని ఛిద్రం చేయ‌డమే కాకుండా త‌న‌ను 35 ముక్క‌లు చేశాడు. తాజా ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Exit mobile version