Site icon vidhaatha

Chandanagar | చందానగర్‌: తొమ్మిదేళ్ళ కూతురిని.. బ్లేడుతో గొంతు కోసి చంపిన తండ్రి

Chandanagar |

విధాత, సొంత కూతురిని మమకారం మరిచిన ఓ తండ్రి సొంత కూతురిని హత్య చేసిన అమానవీయ ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌, హిమ దంపతులు కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. వారికి తొమ్మిదేళ్ల కూతురు మోక్షజ్ఞ ఉండగా, తరుచుగా మూడు రోజులకు ఒకసారి కూతురిని చూడటానికి హిమ ఇంటికి చంద్రశేఖర్ వెలుతున్నాడు.

బెల్ లోని జ్యోతి స్కూల్‌లో నాలుగవ తరగతి చదువుతున్న మోక్షజ్ఞను శనివారం స్కూల్‌లో నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన చంద్రశేఖర్ పెన్సిల్‌ బ్లేడ్‌తో మోక్షజ్ఞ గొంతుకోసి హత్య చేశాడు. కూతురి మృతిని తండ్రి చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసే క్రమంలో పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డులో కారుకు ప్రమాదం కావడంతో బయటపడ్డ హత్యోదంతం బయటపడింది.

ఓఆర్ఆర్ మీద డివైడర్ ఢీ కొట్టి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చంద్రశేఖర్‌ను విచారించడంతో మోక్షజ్ఞ హత్యోదంతం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు చంద్రశేఖర్‌, హిమలు ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆమెకు పదోన్నతి రావడం, తన ఉద్యోగం పోవడంతో భార్య వల్లనే తన ఉద్యోగం పోయిందన్న కోపంతో చంద్రశేఖర్‌ కూతురి హత్యకు పాల్పడినట్లుగా సమాచారం.

Exit mobile version