Khazana Jewellery | ఖజానా జ్యూవెలరీ షాపు దోపిడీ కేసు నిందితుల అరెస్టు

చందానగర్ ఖజానా జ్యూవెలరీ దోపిడీ కేసులో కీలక మలుపు. పూణేలో బీహార్ నిందితుల అరెస్ట్, మిగతా ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

hyderabad-khazana-jewellery-shop-robbery-accused-arrested

Khazana Jewellery | విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన చందానగర్ ఖజానా జ్యూవెలరీ(Khazana Jewellery) షాపు చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చందానగర్‌లోని(Chandanagar) ఖజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు చొరబడి అసిస్టెంట్ మేనేజర్‌పై తుపాకులతో కాల్పులు జరిపి 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులు నిందితులను మహారాష్ట్ర పూణేలో పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్(DCP Vineeth Kumar) కేసు వివరాలను వెల్లడించారు. దోపిడీ ఘటనలో బీహార్ కు చెందిన 7గురు నిందితులు పాల్గొన్నారని.. అశీష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ లను పూణేలో అరెస్టు చేశామని.. మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. 20 రోజుల క్రితం నగరానికి వచ్చి దోపిడికి స్కెచ్ వేశారని తెలిపారు.

పట్టుబడిన నిందితుల నుంచి దోపిడీ చేసిన 900 గ్రాముల గోల్డ్ కోటెడ్ సిల్వర్ నగలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 4 తుపాకులతో పాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాటిని బీహార్ నుంచి కొనుగోలు చేశారని… నిందితులపై బీహార్ లో 4, 5 కేసులు నమోదు అయి ఉన్నాయని వివరించారు. పారిపోయిన నిందితుల్లో ఒకరిపై 10కేసులు..అందులో మర్డర్, రేపు, దోపిడీ కేసులున్నాయన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.