Site icon vidhaatha

World Bank | ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నిక

World Bank

విధాత: ప్రపంచ బ్యాంక్(World Bank) అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బంగాను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు ప్రకటించింది.

బంగా సారథ్యం లో పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని బోర్డు ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదురుకొంటున్న సవాళ్ళను అధిగమించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ ఆశయాలను బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్ జూన్ 1 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. బంగా ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. బంగా ఇప్పటివరకు మాస్టర్ కార్డ్, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత హోదాల్లో పని చేశారు.

కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవ‌లందిస్తున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌, చీఫ్‌ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్‌ గిల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్‌ సుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పరమేశ్వరన్‌ అయ్యర్ కొన‌సాగుతున్నారు.

Exit mobile version