Flying Car
విధాత: ట్రాఫిక్ చక్రబంధంలో మనం వెళ్తున్న కారు ఇరుక్కుపోతే ఆ బాధ వర్ణణాతీతం. ట్రాఫిక్ నుంచి ఎప్పుడు, ఎలా బయటపడాలని తలలు పట్టుకుంటాం. అమెరికా చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ అరుదైన కారును తయారుచేసింది. అదే ఎగిరే కారు.
అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన మొదటి ఎగిరే కారు ఇదే కావడం విశేషం. అలెఫ్ ‘మోడల్ A’ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేక ఎయిర్ వర్థినెస్ సర్టిఫికేషన్‌ను పొందిందని కంపెనీ తెలిపింది.
ఈ కారు ప్రత్యేకతలు ఏమిటంటే
ఈ కారు ధర రూ.2.5 కోట్లు ( $300,000). ఈ కారు 100 శాతం ఎలక్ట్రిక్. కారు రోడ్లపై నడపతగినది, నిలువుగా టేకాఫ్ ఎగురగలదు, ల్యాండింగ్ సామర్థ్యాలను కలిగి ఉండగా, కారులో ఇద్దరు ప్రయాణికులు వెళ్లగలరు.