Site icon vidhaatha

CPR | విమానంలో గుండెపోటు.. సీపీఆర్‌ చేసిన వ్యాపారవేత్త

CPR

విధాత: గుండెపోటుకు గురైన వారికి చాలా చోట్ల డాక్టర్లు సీపీఆర్‌ చేసి బతికించడం చూసి ఉంటాం. కానీ ఓ వ్యాపారవేత్త తోటి ప్రయాణికుడిని రక్షించడం చాలా అరుదు. అదే రీతిలో గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం గాల్లో ఉండగానే బాబు రెడ్డి అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సృహతప్పి పడిపోవడంతో పక్కనే కూర్చున్న యువ వ్యాపారవేత్త కరణ్ భాంగయ్ సీపీఆర్ చేసి అతన్ని రక్షించాడు. ఈ విషయంపై గ్లోబల్ లగ్జరీ గ్రూప్ వ్యవస్థాపకుడు కరణ్ భాంగయ్ తన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘విమానం గాల్లో ఉన్నప్పుడు బాబురెడ్డి అనే మధ్య వయసు ప్రయాణికుడు ఉన్నట్లుండి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

అది గమనించిన నేను అతని పరిస్థితి బాగా లేదని గుర్తించి వెంటనే అతని చొక్కా విప్పి, మొహంపై నీళ్లు చల్లి, సీపీఆర్ చేయడం మొదలు పెట్టాను. అప్పటికే అతని శరీరం చల్లబడటం మొదలైంది. అయినా కూడా సీపీఆర్ చేయడంతో అతడు నిదానంగా స్పందించాడు.

బతుకుతాడో లేడోనని ఆశలు వదులుకున్న మేము, అతడు సృహలోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నాము. ఈ రోజు నా జీవితంలో అస్సలు మరిచిపోలేని రోజు. ఇంత వరకు నేను, బాబు రెడ్డి అపరిచితులం. కానీ ఇప్పటి నుంచి ఒకరిపై ఒకరికి ప్రత్యేకమైన బంధం ఏర్పడింది’ అని కరణ్ తెలిపాడు. అలాగే.. ప్రాథమిక చికిత్స అయినటు సీపీఆర్ నేర్చుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

Exit mobile version