Apple Phone | విడాకులు కోరిన భార్య.. ఆపిల్‌ కంపెనీపై దావా వేసిన భర్త..! అసలు కారణం ఏంటో తెలుసా..?

Apple iPhone | ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య కోర్టులో పిటిషన్‌ వేసింది. అయితే, తనకు భార్య దూరమవడమే కాకుండా ఆర్థికంగా నష్టం జరుగుతుందని.. దీని అంతటికీ కారణం ఆపిల్‌ కంపెని అంటూ కోర్టు మెట్లెక్కాడు. ఏకంగా 5 మిలియన్‌ డాలర్ల పరిహారం ఇవ్వాలంటూ దావా వేశాడు.

  • Publish Date - June 19, 2024 / 07:46 AM IST

Apple iPhone | ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య కోర్టులో పిటిషన్‌ వేసింది. అయితే, తనకు భార్య దూరమవడమే కాకుండా ఆర్థికంగా నష్టం జరుగుతుందని.. దీని అంతటికీ కారణం ఆపిల్‌ కంపెని అంటూ కోర్టు మెట్లెక్కాడు. ఏకంగా 5 మిలియన్‌ డాలర్ల పరిహారం ఇవ్వాలంటూ దావా వేశాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన సదరు వ్యాపారవేత్త ఐమ్యాక్‌ ల్యాప్‌టాప్‌లో ఓ సెక్స్‌ వర్కర్‌తో ఛాట్‌ చేశాడు. ఆ తర్వాత మెసేజ్‌లన్నీ డిలీట్‌ చేశాడు. తాను చేసిన పని ఎవరికీ తెలియదని భావించాడు.

అయితే, ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తుల్లో ఐమెసేజెస్‌కు ఓ సౌలభ్యం ఉన్నది. ఒకే ఆపిల్‌ ఐడీతో ఉపయోగిస్తున్న ఐఫోన్‌, ఐమ్యాక్‌లలో ఏదైనా డిలీట్‌ చేసిన మెసేజ్‌లు మరో డివైజ్‌లో చూడవచ్చు. సింక్రనైజేషన్‌ ప్రక్రియతో ఈ పని సాధ్యమవుతుంది. ఈ విషయం తెలియని వ్యాపారవేత్త మెసేజ్‌లను డిలీట్‌ చేసి ప్రశాంతంగా ఉంటూ వచ్చాడు. అయితే, భర్త నిర్వాకాన్ని ఆమె మొబైల్‌లో చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. సాక్ష్యంగా మెసేజ్‌లను చూపించింది. విడాకులు మంజూరైతే భరణం కింద 5 మిలియన్‌ డాలర్లు భార్యకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఓ వైపు భార్య దూరం కావడంతో పాటు ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశం ఉండడంతో ఆ వ్యాపారవేత్త లబోదిబోమంటూ.. తన ఛాటింగ్‌ విషయం బయటపడడానికి ఆపిల్‌ కంపెనీయే కారణమని భావించారు. మెసేజ్‌లు డిలీట్ చేసినప్పుడు ‘యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్’ అని సందేశం వచ్చిందని, దాంతో తాను భరోసాగా ఉన్నానని చెప్పాడు.

అలా కాకుండా ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్’ అనో లేకపోతే.. ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్ ఓన్లీ’ అనో సందేశం కనిపిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నాడు. సెక్స్ వర్కర్‌ఓ తన చాటింగ్ విషయాన్ని భార్య మూడ్ బాగున్నపుడు తానే చెప్పేవాడినని చెప్పుకొచ్చాడు. అయినా తమ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని ఒప్పుకున్న వ్యాపారవేత్త.. విడాకుల వరకు వచ్చేది కాదన్నాడు. ఆపిల్ కంపెనీ చేసిన పనితో తెలిసేసరికి తన భార్య హర్టయిందని.. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత యాపిల్ కంపెనీదేనని కోర్టుకెక్కాడు. తనలాగే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన వారంతా ముందుకు రావాలని.. న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చాడు.

Latest News