విధాత: దిల్లీ మెట్రోలో తీసిన వీడియో (Viral Video) ఏదో ఒకటి ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే పొట్టి బట్టలేసుకుని మెట్రో ఎక్కిన ఓ యువతి వీడియో వైరల్ కాగా తాజాగా కాస్త చనువుగా పట్టుకుని కూర్చున్న ఓ కపుల్ వీడియో బయటకు వచ్చింది.
అభినవ్ ఠాకుర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. వీళ్లని చూస్తుంటే జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా ఆ ట్వీట్‌ను మెట్రో అధికారులకు ట్యాగ్ చేశాడు. అయితే మిగిలిన యూజర్లు దీనిపై భిన్నంగా స్పందించారు.
Wtf is this @DCP_DelhiMetro @OfficialDMRC#DelhiMetro
I am feeling very awkward. Please help pic.twitter.com/sEoPTWaOby
— Abhinav Thakur (@abhi_thakurnew) May 12, 2023
ఆ వీడియోలో చూడకూడనిది ఏముందని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. వారి అనుమతి లేకుండా ఇలా వీడియో తీయడం చట్టవిరుద్ధమని మరొకరు పేర్కొన్నారు. అయితే వారి కామెంట్లకు అభినవ్ స్పందించాడు. అక్కడ జరిగిన అసలైన ఘోరాన్ని వీడియో తీయలేదని మరో ట్వీట్ చేశాడు.