Site icon vidhaatha

Youth Congress | అసెంబ్లీ.. ముందు ఉద్రిక్తత

Youth Congress

విధాత: నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కొంత ఉద్రిక్తతకు దారితీసింది.

అసెంబ్లీ ముట్టడికి అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, నగర అధ్యక్షుడు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వివాదాలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టి అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేశారు.

Exit mobile version