YS Vimala | షర్మిల, సునితలు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు

దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో నెలకొన్న రాజకీయ విబేధాలపై తొలిసారిగా ఏపీ సీఎం జగన్ మేనత్త వైఎస్‌. విమల స్పదించారు. ఓ టీవి చానల్‌తో మాట్లాడిన విమల జగన్‌పై కక్ష సాధింపు కోసమే షర్మిల, సునితలు రాజకీయ వైరానికి దిగారని ఆరోపించారు.

  • Publish Date - April 13, 2024 / 03:07 PM IST

జగన్‌పై వ్యక్తిగత కక్షతోనే రాజకీయ వైరం
సీఎం జగన్ మేనత్త వైఎస్ విమల

విధాత: దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో నెలకొన్న రాజకీయ విబేధాలపై తొలిసారిగా ఏపీ సీఎం జగన్ మేనత్త వైఎస్‌. విమల స్పదించారు. ఓ టీవి చానల్‌తో మాట్లాడిన విమల జగన్‌పై కక్ష సాధింపు కోసమే షర్మిల, సునితలు రాజకీయ వైరానికి దిగారని ఆరోపించారు. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల, సునితలు చేస్తున్న రాజకీయాలను ఆపడానికి కుటుంబంలోని పెద్దవాళ్లమంతా చేతులెత్తిసినట్లేనని, షర్మిలను మార్చే శక్తి లేక వైఎస్‌.విజయమ్మ అమెరికా వెళ్లిపోయారని విమల వెల్లడించారు.

షర్మిల, సునితల వ్యవహారశైలీతో రాష్ట్రం నాశనం అవుతుందని, కోవిడ్‌ను కూడా అధిగమించి జగన్ మంచి పాలన అందించి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల, సునితల మాటలు చూస్తే వారి పర్సనల్ ఎజెండా కనిపిస్తుందని, శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలుగా, రాజకీయ పావులుగా మారిపోయారన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల సిఫారసులకు తావు లేకుండా పోయిందని, అందుకే వారు కోపం పెట్టుకున్నారని, అందరికి పదవులు కావాలంటే అది సాధ్యం కాదని, పదవులు లేకుండా ప్రజాసేవ చేయలేరా అని ప్రశ్నించారు.

అవినాశ్‌రెడ్డి పట్ల దివంగత వివేకానందరెడ్డి ఎంతో సానుకూలంగా ఉండేవారని, అతను రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షిచేవారన్నారు. ఈ ఎన్నికల్లో అవినాశ్ హంతకుడంటూ కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని చెబుతుందని, రాజకీయాల్లో ఈ రకంగా ఓట్లు అడుగుతున్న షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. వివేకాను అవినాశ్ హత్య చేశాడని షర్మిల, సునితలు అసత్య ప్రచారం చేస్తున్నారని, అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారన్నారు.

నిజంగా హత్య చేసినోళ్లు బయట తిరుగుతున్నారని..వారికి బెయిల్ ఇవ్వాలని వీరు సుప్రీంకోర్టుకు వెళ్లారని, హత్యతో సంబంధం లేని భాస్కర్‌రెడ్డి జైలులో ఉన్నారని, అవినాశ్ బెయిల్ రద్దు చేయమంటున్నారని విమల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అవినాష్ రెడ్డి హత్య చేసినట్టు మీరు చూసారా? అసలు మీరు (సునీత షర్మిలను) అవినాష్ రెడ్డి హత్య చేశాడని ఎలా డిసైడ్ అవుతారని, ఇంకా కోర్టులు, జడ్జిలు ఎందుకు అంటూ షర్మిల, సునిల తీరును విమల తప్పుబట్టారు.

Latest News