8.8.8 Rule | 8.8.8 నియ‌మాన్ని పాటిస్తే ఒత్తిడిని జ‌యించొచ్చు.. క‌చ్చితంగా విజ‌యం మీదే..! అది ఎలాగో తెలుసా..?

8.8.8 Rule | ప్ర‌తి ఒక్క‌రూ ఒడిదుడుకుల జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. తెల్ల‌వారుజామున నిద్ర లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే దాకా ఒత్తిడికి గుర‌వుతూనే ఉంటారు. ఏదో ఒక స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ క‌నీసం కంటి నిండా కూడా నిద్ర పోలేని ప‌రిస్థితి దాపురించింద‌న‌డానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది ఈ జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. మ‌రి ఈ ఒడిదుడుకుల జీవితానికి ముగింపు ప‌ల‌క‌డం కూడా మ‌న చేతుల్లోనే ఉంది. మ‌న జీవన విధానాన్ని కొంచెం మార్చుకుంటే స‌రిపోతోంది.

  • Publish Date - June 20, 2024 / 07:53 AM IST

8.8.8 Rule | ప్ర‌తి ఒక్క‌రూ ఒడిదుడుకుల జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. తెల్ల‌వారుజామున నిద్ర లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే దాకా ఒత్తిడికి గుర‌వుతూనే ఉంటారు. ఏదో ఒక స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ క‌నీసం కంటి నిండా కూడా నిద్ర పోలేని ప‌రిస్థితి దాపురించింద‌న‌డానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది ఈ జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. మ‌రి ఈ ఒడిదుడుకుల జీవితానికి ముగింపు ప‌ల‌క‌డం కూడా మ‌న చేతుల్లోనే ఉంది. మ‌న జీవన విధానాన్ని కొంచెం మార్చుకుంటే స‌రిపోతోంది. ఒక స‌మ‌య పాల‌న ప్ర‌కారం ప‌నులు చేసుకుంటూ ముందుకు వెళ్తే.. ఒత్తిడిని అధిగ‌మించొచ్చు. ఈ స‌మ‌య పాల‌న‌కు 8-8-8 నియ‌మాన్ని పాటిస్తే స‌రిపోతోంది. ఈ నియ‌మాన్ని పాటిస్తే మాన‌సికంగా, శారీర‌కంగా, మొత్తంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా మెరుగవుతాయి. మ‌రి 8.8.8 నియ‌మం ఏంటో తెలుసుకుందాం.

8.8.8 నియ‌మం అంటే ఏంటి..?

వృత్తిప‌ర‌మైన‌, వ్య‌క్తిగ‌త జీవితాన్ని స‌మ‌తుల్యం చేయ‌డానికి 8.8.8 అనే నియ‌మం మంచి ఆయుధంగా ప‌ని చేస్తుంది. రోజుకు 24 గంట‌ల స‌మ‌యం ఉంటుంది. ఈ స‌మ‌యాన్ని ఎనిమిది గంట‌ల చొప్పున‌ మూడు భాగాలుగా విభ‌జించుకోవాలి. ఎనిమిది గంట‌లు వృత్తిప‌ర‌మైన జీవితానికి కేటాయించాలి. మ‌రో ఎనిమిది గంట‌లు కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో గ‌డిపేందుకు కేటాయించాలి. ఇక మిగిలిన ఎనిమిది గంట‌ల స‌మ‌యాన్ని నిద్ర‌కు కేటాయించాలి. ఈ ఎనిమిది గంట‌ల పాటు హాయిగా నిద్రిస్తే.. శారీర‌కంగా, మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబ‌ట్టి మీరు చేసే వృత్తిప‌ర‌మైన ప‌నులు సాఫీగా సాగిపోతాయి. కుటుంబంలో చికాకులు లేకుండా గ‌డిపేందుకు అవ‌కాశం ఉంటుంది.

మ‌రి ప్రయోజనాలు ఏంటి?

ఈ 8.8.8 నియ‌మం అంద‌రికి అనుకూలించ‌క‌పోవ‌చ్చు. వారి వారి ప‌నుల‌ను బ‌ట్టి ఈ నియ‌మాన్ని పాటిస్తే చ‌క్క‌టి ఫ‌లితాలు పొందే ఆస్కారం ఉంటుంది. మీ జీవనశైలిని ఆరోగ్యంగా, సంతృప్తికరంగా మార్చడానికి ఇది ఒక గొప్ప సాధనం. మీ పనులను ఎలా చేసుకోవాలో మీ చేతిలోనే ఉంటుంది. కాబ‌ట్టి ఈ నియమాన్ని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయరు. అలాగే దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఇక ప్ర‌తి ప‌నికి నిర్దిష్ట‌మైన స‌మ‌యాన్ని కేటాయించ‌డం ద్వారా అనుకున్న స‌మ‌యంలో ఆ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. దాంతో పాటు కుటుంబ స‌భ్యుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. పుస్త‌కాలు చ‌దివేందుకు కూడా వీలుంటుంది. ఇలాంటి మంచి ప‌నుల వ‌ల్ల మ‌న‌లో సృజ‌నాత్మ‌క‌త పెంపొందుతుంది. ఎల్ల‌ప్పుడూ ఉల్లాసంగా ఉండేందుకు చాన్స్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌డానికి సహాయపడుతుంది.

ఈ నియమం పాటించ‌డం అంత సుల‌భం కాదు.. కానీ

8.8.8 నియ‌మాన్ని పాటించ‌డం అంత సుల‌భం కాదు. ఈ నియ‌మాన్ని పాటించ‌డం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ప్రతిరోజు సరిగ్గా ఎనిమిది గంటల షెడ్యూల్‌ను రూపొందించుకుని అమలు చేయడంలో రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. ఇంట్లో, కార్యాల‌యాల్లో ఒత్తిళ్ల కారణంగా ఈ నియ‌మాన్ని కొనసాగించడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, మీరు సరైన ప్రణాళికను రూపొందించుకుని, అంకితభావంతో ఈ నియమాన్ని పాటిస్తే మీరు జీవితంలోని అనేక రంగాలలో ఖచ్చితంగా విజయం సాధించగలరు.

Latest News