Ant Phobia | వింత ఘటన..చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య. "చీమల భయంతో బతకడం నావల్ల కాదు" అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

In sangareddy housewife suicide because of antphobia

విధాత: అనేక రకాల సమస్యలు..కారణాలు, మానసిక రుగ్మతలతో మనుషులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే ఓ మహిళ చీమల భయంతో ఆత్మహత్య చేసుకున్నఘటర వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనీషా భర్త శ్రీకాంత్ కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికి ఆమెకు ఆ వ్యాధి తగ్గలేదు. చీమల భయంతో బతకడం నావల్ల కాదు అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు చేసుకుంది. చీమల ఫోబియాతో మహిళా చనిపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.