Life style : శృంగారం ఒక సృష్టి కార్యం. ఈ భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలయికగా భావిస్తారు. అలాంటి వారికి శృంగారంవల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి శృంగారం దోహదపడుతుందని అంటున్నారు. మరి శృంగారం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందామా..?
ప్రయోజనాలు..
1. శృంగారంతో ఆయువు పెరుగుతుందట. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. హృదయ సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయట.
2. మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదించే వారిలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయట. వారిలో మతిమరుపు దరి చేరదట. మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట.
3. క్రమం తప్పని శృంగారం గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్న వారికి ఒక ఔషధంలా పనిచేస్తుందట. గుండె రోగులు వారానికి ఒకసారైనా శృంగారాన్ని ఆస్వాదిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట. మరణాల రేటు కూడా తగ్గుతుందట.
4. పరిశోధకులు 65 ఏండ్లలోపు వయసున్న వారిని ఎంపిచేసుకుని, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు.
5. ఆ రిపోర్టు ప్రకారం.. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 37 శాతం తగ్గగా, వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 38 శాతం తగ్గిందట.
6. ఇక వారానికి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొనని వారిలో మరణాల రేటు కేవలం 28 శాతం మాత్రమే తగ్గిందట. దీన్నిబట్టి శృంగారంతో ఆయువు కూడా పెరుగుతుందని నిర్ధారణ అయ్యింది.
7. నిత్య శృంగారంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే శృంగారంవల్ల సంతృప్తి మాత్రమేగాక శరీరంలో యాంటీబాడీస్ సంఖ్య పెరుగుతుందట. శరీరం వివిధ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో శృంగారం బాగా తోడ్పడుతుందట.
8. అదేవిధంగా నిత్య శృంగారంవల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయట. యూరిన్లీకేజీసమస్య ఉంటే తక్షణమే తగ్గిపోతుందట.
9. శృంగారం వల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుందట. సాధారణంగా హార్మోన్‌లు బ్యాలెన్స్ తప్పడంవల్ల హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. శృంగారంవల్ల శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ లెవెల్స్సరిగ్గా ఉంటాయట. దాంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట.
10. అంతేకాదు నిత్యం శృంగారంలో పాల్గొనే జంటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారట. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్కూడా ఎక్కువగా ఉంటాయట. శరీరం చురుగ్గా పనిచేస్తుందట.
11. నిద్రలేమి సమస్యకు కూడా నిత్య శృంగారం చక్కని పరిష్కారమట. క్రమం తప్పని శృంగారంతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట. శరీరం రిలాక్స్‌గా ఉంటుందట. అందువల్ల రోజూ శృంగారంలో పాల్గొనే జంటలు ఉల్లాసంగా ఉంటారట.