Site icon vidhaatha

Life style | ఆ పనిలో సొంత ప్రయోగాలు చేయకండి.. మొదటికే మోసం తెలుసా..!

Life style : శృంగారం అనేది సృష్టికార్యం. ఆలుమ‌గ‌ల బంధాన్ని అంత‌కంత‌కే బ‌లోపేతం చేయ‌డంలో శృంగారానిదే ప్రధాన‌పాత్ర అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. శృంగారంవ‌ల్ల భూమిపై మ‌నిషి మ‌నుగ‌డ కొన‌సాగుతున్నది. అంతేగాక స్త్రీ, పురుషులు ఇద్దరిలో మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం దోహ‌ద‌ప‌డుతున్నది. అయితే శృంగార స‌మ‌యంలో అతిచేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ‌రి శృంగార స‌మ‌యంలో చేసే ఆ అతి ఏమిటి..? దానివ‌ల్ల క‌లిగే అన‌ర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది శృంగారంలో ఎక్కువ హాయిని అనుభ‌వించ‌డం కోసం ఏవోవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ ప్రయ‌త్నాల్లో ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా శృంగభంగం అయ్యే ప్రమాదం ఉంది. శృంగారం సులువుగా జ‌రిగేందుకు స్త్రీ జ‌ననాంగాల్లో స‌హ‌జంగానే లూబ్రికెంట్స్ ఉత్పత్తి అవుతాయి. అయినా, కొంద‌రు మ‌రింత హాయిని ఆస్వాదించ‌డం కోసం కృత్రిమ లూబ్రికెంట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. పెట్రోలియం జెల్లీ లాంటి కృత్రిమ లూబ్రికెంట్లను వాడ‌టంవ‌ల్ల స్త్రీజ‌న‌నాంగాల్లో బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంద‌ని హెచ్చరిస్తున్నారు. దాంతో ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం ఉందంటున్నారు.

కాస్మొటిక్స్ ఎప్పుడూ లూబ్రికెంట్స్ కావు

కొంద‌రు మార్కెట్‌లో దొరికే సంబంధిత కృత్రిమ‌ లూబ్రికెంట్స్ కాకుండా కాస్మొటిక్‌ బాడీ లోషన్‌ల‌ను కూడా లూబ్రికెంట్స్‌గా వాడుతుంటారు. అది మరింత ప్రమాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. కాస్మొటిక్స్‌లోని కృత్రిమ‌ ర‌సాయ‌నాలు ఇన్‌ఫెక్షన్‌ల‌కు దారితీస్తాయ‌ని హెచ్చరిస్తున్నారు. కొంత‌మంది ఆలివ్ ఆయిల్‌ను కూడా లూబ్రికెంట్‌గా ఉప‌యోగిస్తుంటారు. అది కూడా ప్రమాద‌క‌ర‌మేన‌ని సెక్సాల‌జిస్టులు అంటున్నారు. ఇలాంటి ఆయిల్ స్త్రీజ‌న‌నాంగాల్లో పేరుకుపోయి అనారోగ్యాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

విప‌రీత భంగిమ‌లు ప్రమాద‌క‌రం

అదేవిధంగా శృంగార భంగిమ‌ల విష‌యంలో కూడా స్త్రీ, పురుషులు అతి చేయ‌కూడ‌ద‌ని సెక్సాల‌జిస్టులు సూచిస్తున్నారు. అశ్లీల చిత్రాలు చూసి వాటిలో క‌నిపించే అన్ని ర‌కాల భంగిమ‌ల‌ను ప్రయ‌త్నిస్తే చాలా ప్రమాద‌క‌ర‌మ‌ని హెచ్చరిస్తున్నారు. అలాంటి సినిమాలు చేసేవాళ్లు కొత్తద‌నం కోసం విప‌రీత భంగిమ‌లు చూపిస్తార‌ని, కానీ అవ‌న్నీ అంద‌రూ చేయ‌గ‌లిగిన‌వి కావ‌ని చెబుతున్నారు. స్త్రీ, పురుషుల‌ వ‌య‌సు, శ‌రీర బ‌రువుల‌ను బ‌ట్టి అనువైన భంగిమ‌లు మాత్రమే ప్రయ‌త్నించ‌డం ఉత్తమ‌మ‌ని సూచిస్తున్నారు.

Exit mobile version