Life style | బాత్రూమ్‌లో గలీజ్‌ వాసన రావద్దంటే ఈ టిప్స్‌ పాటించండి..!

Life style : ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ నుంచి గలీజ్‌ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధుల వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు చూద్దాం..

  • Publish Date - May 22, 2024 / 09:30 PM IST

Life style : ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ నుంచి గలీజ్‌ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధుల వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు చూద్దాం..

వెంటిలేషన్ ఉండాలి

  • బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వెంటిలేషన్ సమస్య కూడా ఒకటి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే ముందుగా వెంటిలేషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. బాత్రూమ్ లోకి వెంటిలేషన్ ఉంటే గాలి బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది. కానీ చాలా ఇళ్లలో బాత్రూమ్‌కు వెంటిలేషన్ సరిగా ఉండట్లేదు. అలాంటప్పుడు బాత్రూమ్‌కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, విండో ఏర్పాటు చేసుకోవాలి.
  • తరచూ శుభ్రం చేయాలి
  • బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే రెండు రోజలుకు ఒకసారైనా శుభ్రం చేయాలి. అదేవిధంగా కేవలం నీళ్లతో కాకుండా బాత్రూమ్‌ను క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజంట్లను ఉపయోగించాలి. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
  • ఫ్లష్ ట్యాంక్‌ను క్లీన్ చేయాలి
  • వెంటిలేషన్ సరిగ్గా ఉండి, బాత్రూమ్ క్లీన్ చేసినా దుర్వాసన వస్తూ ఉందంటే అందుకు ఫ్లష్ ట్యాంక్ కూడా కారణమై ఉండవచ్చు. ఎందుకంటే ఫ్లష్ ట్యాంకులో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియా పెరగడం, నాచు పట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి తరచూ ఫ్లష్ ట్యాంకును శభ్రం చేస్తుండాలి.
  • ప్లంబింగ్ చెక్ చేసుకోవాలి
  • ప్లంబింగ్ లోపాల కారణంగా కూడా బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుంది. సింక్స్, బ్రాత్రూమ్‌లో నిరంతరం దుర్వాసన వస్తూ ఉంటే ప్లంబర్‌ని పిలిపించి ఒకసారి ప్లంబింగ్‌ను చెక్ చేయించాలి. సింక్ గొట్టాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కూడా ఇలా దుర్వాసన వస్తుంది.

Latest News