Site icon vidhaatha

Kidney Health: కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ టిప్స్ పాటించండి

Kidney Health:  శరీరంలో కిడ్నీల పాత్ర ఎంతో ముఖ్యమైనది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను వడపోయడం.. శరీరంలోని అధిక నీటిని మూత్రం ద్వారా బయట పంపించడం కిడ్నీల పని. అయితే ఇటీవల చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడం.. ఇతర కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రావడం.. పూర్తిగా కిడ్నీలు పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్,  డయాలసిస్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే కిడ్నీలకు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావొచ్చిన వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న చిన్న వ్యాయామాలతో..
కొన్ని చిన్న వ్యాయామాలతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజు వాకింగ్ చేయడం.. యోగా, సైక్లింగ్ లేదా తేలికపాటి ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక బీపీ, షుగర్ మూత్రపిండాలకు శత్రువులని.. కాబట్టి కచ్చితంగా వీటిని అదుపులో ఉంచుకోవాలని వారు కోరుతున్నారు. శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాలని కోరుతున్నారు. తగిన మోతాదులో మంచినీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఆహారపదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని.. జంక్ ఫుడ్, నూనేలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలని.. వీటితోపాటు ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు.

Disclaimer: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ సేకరించిన డాటా ఆధారంగా ఇచ్చింది మాత్రమే. మీకు మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా సమస్య వస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.

 

Exit mobile version