Site icon vidhaatha

పొగాకు క్యాన్సర్లతో ఏటా 10.30 ల‌క్ష‌ల మృతి


విధాత‌: ధూమపానంతో వచ్చే క్యాన్సర్ల కార‌ణంగా ప్రతి సంవత్సరం 10.30 ల‌క్ష‌ల మృతి (1.3 మిలియన్ల) మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశం, చైనా, యూకే, బ్రెజిల్, రష్యా, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న‌ట్టు లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్ల‌డైంది. ఈ అధ్య‌య‌న నివేదిక ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్ర‌చురిత‌మైంది.


ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం క్యాన్సర్ల కార‌ణంగా చ‌నిపోతున్న సంఖ్య‌లో స‌గం మంది ఈ ఏడు దేశాల నుంచే ఉన్న‌ట్టు ప‌రిశోధ‌కులు కనుగొన్నారు. ధూమపానం, ఆల్కహాల్, ఊబకాయం, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్లు దాదాపు 20 ల‌క్ష‌ల (రెండు మిలియన్లు) మంది మరణాలకు కారణమయ్యాయని ప‌రిశోధ‌కులు గుర్తించారు.


ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC), క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ (QMUL), కింగ్స్ కాలేజ్ లండన్, యూకే పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. క్యాన్సర్‌తో కోల్పోయిన జీవితకాలాన్ని కూడా ప‌రిశోధ‌కులు విశ్లేషించారు.

Exit mobile version