Love Marriage | ప్రేమ ( Love )కు హద్దుల్లేవు.. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఎందుకంటే ఆమె వయసు 30 ఏండ్లు.. అతని వయసు 18 ఏండ్లు. ఆవిడకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు( Marriages ) అయి ముగ్గురు పిల్లలు ( childrens ) ఉన్నారు. అతడేమో ఇంటర్( Inter ) చదువుతున్నాడు. వయసులో తన కంటే 12 ఏండ్లు చిన్నవాడైనా ఇంటర్ పోరగాని మీద ఆ ముగ్గురు పిల్లల తల్లికి మోజు పడింది. ఇంకేముంది ఓ ఆలయం (Temple)లో ఇంటర్ అబ్బాయితో ముగ్గురు పిల్లల తల్లి పెళ్లి( Marriage ) చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని అమ్రోహా జిల్లా( Amroha district )కు చెందిన షబ్నమ్(30)కు తల్లిదండ్రులు లేరు. షబ్నమ్ ( Shabnam )కు తొలిసారిగా మీరట్ ( Meerut )కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కొన్నాళ్లకే అతనితో ఆమె విడాకులు( Divorce ) తీసుకుంది. ఆ తర్వాత తాఫిక్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. 2011లో రోడ్డు ప్రమాదంలో తాఫిక్ వికలాంగుడయ్యాడు. ఈ క్రమంలో తాఫిక్‌కు దూరంగా ఉంటున్న షబ్నమ్.. గత వారం విడాకులు తీసుకుంది. ఇక ఆమెకు ముగ్గురు పిల్లలు.
రెండు పెళ్లిళ్లు అయి.. ముగ్గురు పిల్లలు కలిగిన షబ్నమ్‌కు 18 ఏండ్ల వయసు కలిగిన శివపై మనసు పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. శివ కూడా షబ్నమ్‌తో కలిసి జీవించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో షబ్నమ్ మతమార్పిడి చేసుకుని శివానిగా మారిపోయింది. ఇక ఇంటర్మీడియట్ చదువుతున్న శివతో హిందూ సంప్రదాయం( Hindu Custom ) ప్రకారం.. శివానికి బుధవారం పెళ్లైంది. వీరి పెళ్లిని శివ తల్లిదండ్రులు స్వాగతించారు. వారిద్దరూ ప్రశాంతమైన జీవితం గడపాలని శివ తండ్రి కోరుకున్నాడు.
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతమార్పిడి నిషేధిత చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో శివాని(షబ్నమ్), శివ పెళ్లి విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివ, శివానిల పెళ్లి స్థానికంగా చర్చనీయాంశమైంది.